Praja Palana Celebration : అప్పులు దాటి.. అభివృద్ధి బాట
- ఆర్ధిక క్రమశిక్షణకు పెద్దపీట
- తెచ్చిన అప్పులు రూ.52118 కోట్లు
- వడ్డీలు, కిస్తుల చెల్లింపులకు రూ. 64516 కోట్లు
- ప్రతిష్టాత్మక పథకాలకు రూ.61,194 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praja Palana Celebration : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు తొలి ఏడాది నుంచి ప్రజా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అప్పులతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఆర్థికంగా క్రమశిక్షణను పాటించింది. 2014 నుంచి 2023 వరకు పదేండ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలన్నీ కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు అవరోధాలుగా మారాయి. వాటిని అధిగమించి ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోని ఆర్థిక స్థితిగతులపై అసెంబ్లీలోనే శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వం చేసినట్లుగా ఇష్టారాజ్యంగా అప్పుల జోలికి వెళ్లకుండా నియంత్రణ పాటించింది. బడ్జెట్ పరిమితులకు లోబడి మార్కెట్ రుణాలు తీసుకొని ప్రణాళిక ప్రణాళికేతర ఖర్చులకు సరిపడేలా సర్దుబాటు విధానం అనుసరించింది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలలో ఎప్పుడు జీతాలు పడుతాయో తెలియని పరిస్థితి నుంచి.. ఫస్ట్ తారీఖున జీతాలు వేసే పద్ధతిని పునరుద్ధరించింది. గత ప్రభుత్వం బకాయి పెట్టిన దాదాపు లక్ష కోట్ల బిల్లులను క్రమపద్ధతిలో చెల్లించే విధానం అనుసరించింది.
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
గత ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పులు తీర్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. అంటే అప్పు తెచ్చిన దానికంటే ఎక్కువగా రీపేమెంట్లు చేసి తెలంగాణ ప్రజలపై మోపిన రుణభారం తగ్గించింది. 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 52,118 కోట్లు అప్పులు తీసుకుంది. ఇదే వ్యవధిలో రూ. 64,516 కోట్లు రీపేమెంట్లు (అసలు, వడ్డీలు కలిపి కిస్తీలు తిరిగి చెల్లింపులు) చేయటం గమనార్హం. వీటికి తోడుగా ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసిన ప్రతిష్టాత్మక పథకాలకు రూ.61,194 కోట్లు ఖర్చు చేసింది. ఒకవైపు అప్పులను తీరుస్తూనే.. గ్యారంటీల అమలుకు ప్రభుత్వం పెద్దపీట వేసింది.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పథకానికి అవసరమైన నిధులను సమీకరించటంలో ఆర్థిక శాఖ కీలక పాత్రను నిర్వర్తించింది. ఏక కాలంలో రైతులకు రూ.20617 కోట్ల రుణమాఫీ చేసి రికార్డు నెలకొల్పింది. రాష్ట్రంలోని 25.36 లక్షల రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధికి దాదాపు రూ.57 వేల కోట్లు ఖర్చు చేసింది. రుణమాఫీతో పాటు రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా, పంట నష్ట పరిహారానికి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, సన్న వడ్ల బోనస్‌కి భారీగా నిధులను ఖర్చు చేసింది.
రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు నష్ట పరిహారంతో పాటు బాధితులకు సాయం అందించేందుకు రూ.260 కోట్లు కేటాయించింది. అప్పులను తీరుస్తూనే మొదటి ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీ అమలుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి, గృహజ్యోతి తోపాటు యువ వికాసాన్ని అమలు చేసింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగులకు ఉద్యోగాలపై భరోసాను కల్పించింది. తొలి ఏడాదిలోనే వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. 54520 ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ పూర్తి చేసి.. ఎంపికైన అభ్యర్థులకు నియామక ప్రక్రియను పూర్తి చేయటం విశేషం.
వీటితో పాటు చేయూత, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత గృహ విద్యుత్తు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, బియ్యం సబ్సిడీ, స్కాలర్షిప్ లు, డైట్ ఛార్జీల పెంపు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలన్నింటికీ రూ.61,194 కోట్లు ఖర్చు చేసింది. బీసీ, మైనారిటీలకు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి నవంబర్ నాటికే దాదాపు రూ.9888 కోట్లు ఖర్చు చేసింది.
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!