CM Revanth Reddy: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. దీనికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. అదే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం. ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ప్రిలిమ్స్‌కు ఎంపికైన అభ్యర్థుల కోసం ఉద్దేశించి ప్రారంభించినట్లు తెలిపారు. వీరికి ఆర్థిక సాయం అందించేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టామని వెల్లడించారు. దీంతో ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యహస్తం’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు.
Read also: MMTS Services: రెండు రోజులు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. వివరాలివే..
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద లబ్ధి పొందాలనుకునే అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు, కుటుంబ వార్షిక ఆదాయం, ఇతర మార్గదర్శకాలు, నిబంధనలను కూడా రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ప్రభుత్వం జారీ చేసింది. లబ్ధి పొందాలనుకునే వారు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS) జనరల్ కేటగిరీలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయల లోపు ఉండాలి. కేంద్ర, రాష్ట్ర మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కాదు. అలాగే- గతంలో ఈ పథకం నుంచి ఎలాంటి ప్రయోజనం పొంది ఉండకూడదు. అభ్యర్థులు తమ పౌర ప్రయత్నంలో ఒక్కసారి మాత్రమే ఈ ఆర్థిక ప్రోత్సాహకాన్ని పొందవచ్చు. దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య దాదాపు 14 లక్షలు. సింగరేణి కాలరీస్ అంచనా ప్రకారం తెలంగాణ నుంచి ఏటా 50 వేల మంది సివిల్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్న వారి సంఖ్య 400 నుంచి 500 వరకు ఉంటుంది.
G. Kishan Reddy: మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలు..