Rain Alert : తెలంగాణలో వాతావరణ పరిణామాలు మారుతున్నాయి. వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనివల్ల కొన్ని జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశముండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల ప్రజలు…
Weather Updates : తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు వడగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలు వడగాల్పుల ప్రభావంతో అల్లాడుతున్నాయి. వాతావరణ శాఖ ఏకంగా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాలు ఆదిలాబాద్, కుమురంభీం, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల. ఇక్కడ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. మరో 21…
తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటింది. రాష్ట్రంలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. ఈ ఏడు జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది..
Ponnam Prabhakar : హైదరాబాద్ లో ఒక్కసారిగా ఈదురు గాలులు భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. వర్షపాతం ప్రభావం జీహెచ్ ఎంసీ ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఒక్కసారిగా ఈదురుగాలులతో నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగినట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఎమర్జెన్సీ టీమ్స్ డిఆర్ఎఫ్ బృందాలు విరిగిన చెట్లను తొలగించాలని ట్రాఫిక్ ఇబ్బందులు…
Hyderabad Rains : హైదరాబాద్ నగర వాసులకు వాతావరణ శాఖ ఆందోళనకరమైన హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం నగరంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు అధికారులు ప్రకటించిన కొద్ది గంటల్లోనే కుండపోత వానలు మొదలయ్యాయి. పశ్చిమ, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఈ వర్షం కుంభవృష్టిలా కనిపిస్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, మరో 3 గంటల పాటు ఈ కుండపోత వర్షం కొనసాగే అవకాశం…
Coal Mines: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో కురిసిన భారీ వర్షం బొగ్గు గనుల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించింది. ఈ వర్షం ప్రభావంతో జే.వి.ఆర్. ఓసి (JVROC), కిష్టారం ఓసి (Kishtaram OC)లల్లో బొగ్గు ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయింది. వరద నీరు గనుల్లోకి చేరడంతో మట్టి వెలికితీతతో పాటు బొగ్గు తవ్వకాల్లో సమస్యలు ఏర్పడ్డాయి. జేవిఆర్ ఓసి గనిలో రోజుకు సగటున 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. అలాగే సుమారు 50,000 క్యూబిక్ మీటర్ల…
జనగామ జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో భారీ వడగండ్ల వాన కురిసింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. కొంత ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. జనగామ ,లింగాల గణపురం, రఘునాథపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి పంట నేలరాలింది. పలుచోట్ల రహదారులపై చెట్లు నేలకొరిగాయి.
Orange Alert: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారబోతోందా? రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రత్యేకించి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున…
భారత వాతావరణ విభాగం (IMD) తాజాగా వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ను విడుదల చేసింది. ఏప్రిల్ 9 (బుధవారం) నుంచి 12వ తేదీ వరకు దక్షిణ దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40–50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగుపాటు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వర్ష సూచనల ప్రభావం కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, కేరళ, మాహే, కర్ణాటక రాష్ట్రాల్లో కనిపించనున్నట్లు ఐఎండీ పేర్కొంది. సముద్ర…