Hyderabad: హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. ఈ అల్పపీడనం బలహీనపడుతున్నప్పటికీ దాని ప్రభావం మాత్రం పూర్తిగా తగ్గకపోవడంతో జూలై 1వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది.
Read Also: CM Revanth Reddy: పాశమైలారం పరిశ్రమ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. రేపు ఘటనా స్థలం సందర్శన
ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లోని అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, మల్కాజిగిరి, నేరేడు మెట్లు, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే, వికారాబాద్ జిల్లా, శంషాబాద్ పరిసరాలు, అత్తాపూర్, బండ్లగూడ, నార్సింగీ, ఆరాంఘర్ ప్రాంతాలు ఓ మోస్తరు వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం, జీడిమెట్లలో ఓ మాదిరిగా వర్షం పడుతోంది.
Read Also:Maharashtra: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రవీంద్ర చవాన్ నామినేషన్.. అధికారిక ప్రకటన మరింత ఆలస్యం..?
ఇక మేడ్చల్ జిల్లా కీసర, కాప్రా, నాగారం, దమ్మాయిగూడ, జవహర్‌నగర్, కుషాయిగూడ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఎస్‌ఆర్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అదే విధంగా ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రెండు రోజుల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడం మంచింది.
#30JUNE 6:45PM⚠️#Hyderabad Get Ready Mainly North #Hyderabad ⚠️#Patancheru,#Bhel,#Chandanagar,#Kukatpally, #Quthbullapur, #Alwal,#Balanagar & Outskirts will see Heavy Rain Spell in Round -1
Central City will See Moderate Rains.
Another Round ahead after 8PM. pic.twitter.com/yjjFuA8LV0
— Hyderabad Rains (@Hyderabadrains) June 30, 2025