తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలతో చీఫ్ ఎలక్టోరల్ అధికారి శశాంక్ గోయల్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రత్యేక ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై చర్చ జరిగింది. అనంతరం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు. నవంబర్ 1, 2021న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణలో 3,08,75,744 మంది ఓటర్లున్నారు. ఈ జాబితాలో పురుషులు 1,52,57,690 మంది, మహిళలు 1,50,97,292 మంది, థర్డ్ జెండర్ 1,683 మంది, సర్వీస్ ఓటర్లు 14,501 మంది, ఎన్నారై…