Telangana Rising Global Summit : తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8వ తేదీన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్నారు. ఈ కీలకమైన సదస్సును రాజకీయాలకు అతీతంగా జరపాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా, సమ్మిట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,…