ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మన అదృష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత పాలకులు జయ జయహే తెలంగాణ గీతాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. గత పదేళ్లలో తెలంగాణ తల్లి వివక్షకు గురైందన్నారు. ఈ పండుగ రోజు రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.
రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది
తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
KTR: ఈనెల 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానిస్తారని సీఎం రేవంత్ రెడ్డి మాటలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్‌ను ఎవరో వచ్చి ఆహ్వానిస్తే ఎలా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆవిష్కరణ చేసేది.. తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి యా.. కాంగ్రెస్ తల్లి యా? తెలియదని కీలక వ్యాఖ్యలు చేశారు.…