Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో పౌరుషం, చీము నెత్తురు చచ్చిపోయినట్లుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు విచ్చేసిన బండి సంజయ్ మాట్లాడుతూ… ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…. మీలో పౌరుషం చచ్చిపోయిందా? చీము నెత్తురు లేదా? ఆనాడు మీ బిడ్డ పెళ్లినాడు కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా మిమ్ముల్ని అరెస్ట్ చేయించి జైల్లో వేయించిందన్నవ్ కదా? మిత్తీతో సహా చెల్లిస్తానని…