HMDA : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కోకాపేట నియోపోలీస్ భూముల విలువ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) దశలవారీగా నిర్వహిస్తున్న భూవేలాలకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో నాలుగు ప్లాట్లలోని 19 ఎకరాల భూమిని విక్రయించి ₹2,708 కోట్లు సంపాదించిన HMDA, నేడు మూడో విడత వేలానికి సిద్ధమైంది. ఈరోజు ప్లాట్ నంబర్లు 19, 20లోని 8.04 ఎకరాలకు ఆక్షన్ జరగనుంది. గత…
హైదరాబాద్ శివారు ప్రాంతమైన హయత్ నగర్ మండలం కోహెడలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కోహెడలోని సర్వే నెంబర్ 951, 952లో ఉన్న ప్లాట్ల యజమానులకు, అక్కడే ఉన్న ఒక ఫామ్‌హౌస్ యాజమాన్యానికి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. తాజాగా ఈ వివాదం హింసాత్మక రూపం దాల్చింది. వివరాల ప్రకారం, కోర్టు ఆదేశాల మేరకు తమ ప్లాట్లను శుభ్రం చేసుకుంటున్న యజమానులను ఫామ్‌హౌస్ నిర్వాహకులు అడ్డుకున్నారు. అనంతరం ఫామ్‌హౌస్ వర్గీయులు ప్లాట్ల యజమానులపై రాళ్లు ,…
Ponnam Prabhakar : హనుమకొండ జిల్లాలో 3వ ఎడిషన్ క్రేడాయి వరంగల్ ప్రాపర్టీ షోను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. క్రేడాయి ప్రాపర్టీ షో మూడవ ఎడిషన్ వరంగల్ లో విజయవంతంగా నిర్వహిస్తున్న క్రేడాయి ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ తరువాత వరంగల్, హనుమకొండ, కాజీపేట మూడు సిటీ లు కలిసి అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు మంత్రి పొన్నం. ఇటీవలే ఈ ప్రాంతంలో ఆరు వేల కోట్లతో ముఖ్యమంత్రి అభివృద్ది…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్పుడప్పుడు పుంజుకున్నప్పటికీ, 2024లో చాలా వరకు నిరాశాజనకమైన గణాంకాలను చూపుతోంది. నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ , తెలంగాణా యొక్క రిజిస్ట్రేషన్ , స్టాంపుల శాఖ ప్రకారం , హైదరాబాద్‌లో చాలా సంవత్సరాలుగా ఆస్తి రిజిస్ట్రేషన్లు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి.
హైడ్రా అనే పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు కేవలం బ్లాక్ మెయిల్ దందా చేసే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విధానాల వల్ల భూములు అమ్మడంలో జాప్యం అవుతూ రియల్టర్లు, బిల్డర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ తెలిపారు.