TS MLC Elections: తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఏర్పండి. బండిల్స్ పంపిణీ లో గందరగోళం ఏర్పడటంతో.. సిబ్బంది మళ్ళీ బండల్స్ లెక్కపెట్టి టేబుల్స్ కు పంపిణీ చేస్తున్నారు. టేబుల్స్ కు పంపిణీ అయ్యాక కౌంటింగ్ ప్రారంభం అవుతుందని రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంకా అలా వెల్లడించారు. మొదటి రౌండ్ ఫలితం మధ్యాహ్నం 2 వరకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఉదయం 8గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా బండ్స్ పంపిణీ విషయంలో గందరగోళం ఏర్పడింది. కాగా.. మహబూబ్ నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల చేశారు. కౌంటింగ్ కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు అధికారులు. వివిధ పోలింగ్ కేంద్రాల నుండి వచ్చిన బ్యాలెట్ బాక్స్ లోని బ్యాలెట్ పేపర్స్ ను మొదటగా బండిల్స్ తయారు చేసి.. అవన్నీ మిక్సింగ్ చేసిన తర్వాత ప్రతి టేబుల్ వైజ్ గా పంపిణీ చేసి కౌంటింగ్ ప్రారంభించారు. అయితే ఇందులో గందరగోళం ఏర్పడింది. ఎన్నికల కౌంటింగ్ దాదాపు గా 1300 ల మంది సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్ల చేపట్టినా అవకతవకలు ఎలా జరగాయంటూ మండిపడుతున్నారు. మొదటి రౌండ్ ఫలితాలు మధ్యాహ్నం వెలువడితే మిగతా రౌండ్ ఫలితాలు ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Knee Sounds Tips: కీళ్ల నుంచి శబ్దాలు వస్తూ.. నొప్పులు బాగా ఉన్నాయా?
ఇది ఇలా ఉండగా.. తెలంగాణలోని మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేత పేరు ప్రకటించేందుకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 126 ప్రధాన, 11 అదనపు పోలింగ్ కేంద్రాలు సహా మొత్తం 137లో ఓటింగ్ జరిగింది. 16 మంది స్వతంత్రులు సహా 21 మంది అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. అభ్యర్థుల్లో మాజీ ఎమ్మెల్సీ కె జనార్దన్ రెడ్డి, రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అభ్యర్థి పి మాణిక్ రెడ్డి, పిఆర్‌టియు మాజీ ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి, బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం తరపున పోటీ చేసిన ఎవిఎన్ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు ఎనిమిది జిల్లాల నుంచి మొత్తం 29,720 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు, వీరిలో 15,472 మంది పురుషులు, 14,246 మంది మహిళలు ఉండగా, ఇద్దరు ఓటర్లు థర్డ్ జెండర్‌గా నమోదు చేసుకున్నారు.
Read also: Knee Sounds Tips: కీళ్ల నుంచి శబ్దాలు వస్తూ.. నొప్పులు బాగా ఉన్నాయా?
ఇక ఆంధ్రప్రదేశ్ లో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయులు, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే తిరుపతిలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో మార్చి 15న రీపోలింగ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ విషయంలో అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక కౌంటింగ్ ప్రక్రియలో ముందుగా బ్యాలెట్ పేపర్లను పరిశీలించి ముందుగానే చెల్లని ఓట్లను పక్కకు పెట్టేశారు. కాగా.. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు విడుదల చేశారు. ఇక.. వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించట్టుగా వెల్లడించారు. కాగా.. మొత్తం 752 ఓట్లు పోలవ్వగా.. నర్తు రామారావుకు 632 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 108 ఓట్లు రాగా.. అధికారులు 12 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు.
AP-TS MLC Election: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..