Boy Kidnap : వికారాబాద్ జిల్లాలో డబ్బు కోసం ఏడాది బాలున్ని ఎత్తుకెళ్లిన గ్యాంగ్ మగపిల్లలు లేని వ్యక్తికి అమ్మేసి.. సొమ్ము చేసుకున్నారు. నిందితులు విక్రయించిన బాలున్ని స్వాదీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించడంతో తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కథను కరణ్ కోట్ పోలీసులు సుఖాంతం చేశారు. తాండూరు రూరల్ సీఐ నగేష్ కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ నుంచి వచ్చిన భాషా భార్య గోరీబీ, ముగ్గురు కుమారులు, అత్తతో కలిసి గౌతాపూర్లోని మల్లన్న దేవాలయం వద్ద ఉంటున్నాడు. ఈనెల 29న రాత్రి గుడి వద్ద నిద్రించగా మరుసటి రోజు ఉదయం వారి ఏడాది వయస్సు ఉన్న హుస్సేన్ అనే బాలున్ని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లి పోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తాండూరు ఇందిరాగర్ చెదిన చరణ్, పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉండే శంకర్, పద్మమ్మ, హన్మంతు, లక్ష్మీ, సాయమ్మలను నిందితులుగా గుర్తించారు. దీంతో వారిని వి చారించగా భాషా వద్ద ఉన్న చెత్త ఏరుకునే క్రమంలో భాషా కుటుంబంతో పరిచయం ఏర్పడింది.
November 2024 Movie Roundup:సుబ్బరాజు పెళ్లి, అక్కినేని అఖిల్ నిశ్చితార్థం, రెహమాన్ విడాకులు
వారి వద్ద ఉన్న బాబును అపహరించి అమ్ముకునేందుకు ప్లాన్ వేసినట్లు తేలింది. 29న మద్యరాత్రి పద్మమ్మ, చరణ్, సాయమ్మలు కాపాలాగా ఉండగా శంకర్. హన్మంతు. లక్ష్మీలు బాబును ఎత్తుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఎత్తుకెళ్లిన బాబును పట్టణంలోని కృష్ణ అనే వ్యక్తికి విక్రయించేందుకు మాట్లాడుకున్నారు. కృష్ణకు మొత్తం ఆరుగురు అమ్మాయిలే ఉండడంతో బాబును కొనుగోలు చేసేందుకు సిద్దమయ్యాడు.నిందితులు చెప్పిన విధంగా కోకట్ ఔటర్ రోడ్డు వద్ద నిందితుల నుంచి కృష్ణ రూ. 60 వేలకు బాబును కొ సుగోలు చేశాడు. వచ్చిన డబ్బులో ఆరుగురు నిందితులు రూ.10వేల చొప్పున సమానంగా పంచుకుని వెళ్లిపోయారు. మరుసటి రోజు బాలుడి కిడ్నాప్ కలకలం రేపడంతో కృష్ణ అనే వ్యక్తి బాలున్ని మర్పల్లి మండలం పాషాపూర్ కు తీసుకెళ్లాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు కృష్ణ నుంచి బాలుడిని స్వాదీనం చేసుకున్నారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులొ కి తీసుకుని విచారించడంతో బాలుడి కిడ్నాప్ కత సుఖాంతం అయ్యింది. ఇందులో నలుగురును రిమాండ్ చేయగా, హన్మంతు, లక్ష్మీలు పరారిలో ఉండగా స్వాదీనం చేసుకున్న బాలున్ని రూరల్ సీఐ నగేష్ చేతుల మీదుగా తల్లిదండ్రులకు అప్పగించారు.
karavali Teaser: భయపెడుతున్న ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ టీజర్