ఈ ప్రభుత్వం పేదలు కోసం పని చేస్తుందని.. 64 లక్షలు మందికి ఒకటవ తేదీన పింఛన్ లు అందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 34 వేలు కోట్లు రూపాయలు పింఛన్ డబ్బులు ఇప్పటి వరకు అందించామన్నారు. ముఖ్యమంత్రి తాజాగా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతామని తెలిపారు.
KTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. పెన్షన్ పెంపుపై ఏపీ సీఎం మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి అయిన వారంలోనే ఏపీలో వృద్దులకు చంద్రబాబు పెన్షన్ పెంచారని అన్నారు. కానీ.. పెన్షన్ల పెంపుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చిట్టినాయుడు సోదరుల కంపెనీ నడుస్తుందన్నారు. రైతు బంధు, భరోసా కాదు..సీఎం కుర్చి కే భరోసా లేదన్నారు. హైదరాబాద్ లో మనం క్లీన్…