ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం జులై చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి.. తగిన సాయం కోరనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, రహదారులు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు, ప్రభుత్వ ప్రధాన…
విద్యుత్ రంగానికి సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పదవీకాలాన్ని జూలై 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం . లోక్‌సభ ఎన్నికల కారణంగా విచారణలు నిర్వహించడం వల్ల కమిషన్లు పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడంతో పొడిగింపు అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14న కమిషన్‌ను ఏర్పాటు చేసి నివేదికను సమర్పించాలని కోరింది. జూన్ 30. అయితే, ఏప్రిల్ 7న ప్రారంభించిన…
Harish Rao : తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్నికి చీమ కుట్టినట్టు లేదని., బిఆర్ఎస్ పక్షాన దీక్ష విరమణ చేయమని మోతిలాల్ ని కోరడం జరిగిందని ఆయన అన్నారు. ఇది నా ఒక్కడి సమస్య కాదు. రాష్ట్రంలోని నిరుద్యోగులు సమస్య ఇది అన్నారు. మీ తల్లితండ్రులు బాధపడుతున్నారు, ప్రాణం ముఖ్యం అన్నాము. అయినా కూడా దీక్ష విరమణ చేయటం లేదు. ప్రభుత్వం మొద్దునిద్ర పోతుంది. కాంగ్రెస్ ఎన్నికలు ముందు హామీలు ఇచ్చి తప్పించుకుంది.…
Revanth Reddy : ఆదివారం నాడు నిజామాబాద్ లో మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి, షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్ లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ క్రమశిక్షణ కార్యకర్త డి.ఎస్. అని ఆయన అన్నారు. గాంధీ కుటుంబాలకు అంతరంగికుడని., తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ…
Peddi Sudarshan Reddy : తాజాగా బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపట్ల ఆయన స్వంతపార్టీ ఎమ్మెల్యేలో విశ్వాసం తగ్గిందని అన్నారు. ఆయన్ను స్వంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని., ఆయన సిఎం కావడం మెజారిటీ శాసన సభ్యులకు ఇష్టం లేదని, 64 మంది కాంగ్రెస్ నుండి గెలిస్తే అందులో కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సిఎం కు మద్దతు ఇస్తున్నారని ఆయన సంచలన…
Minister Seethakka: ఆదివారం కాగజ్ నగర్ లో మంత్రి సీతక్క పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు కావలసిన నిధులు ఎక్కడ ఆగకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడిని ఉపయోగిస్తామని ఆవిడ చెప్పుకొచ్చారు. అలాగే అక్కడ ఉన్న వారందరూ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలని ఆవిడ తెలియజేశారు. కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించిన డి. శ్రీనివాస్ మృతి తనకి తీవ్ర ఆవేదనను కలగజేసిందని…
తెరుచుకున్న ఏపీఎండీసీ కార్యాలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ), మైనింగ్ డైరెక్టర్ కార్యాలయాలు తెరుచుకున్నాయి. మైనింగ్ శాఖ ఇంఛార్జి బాధ్యతలను సోమవారం యువరాజ్ చేపట్టగా.. ఈ రోజు రెండు కార్యాలయాలు తెరవటానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మైనింగ్ డైరెక్టర్ కార్యాలయం ఓపెన్ చేయగా.. ఉద్యోగులు విధుల్లో చేరారు. మరోవైపు ఏపీఎండీసీ కార్యాలయం కొద్దిసేపట్లో ఓపెన్ కానుంది. విధుల్లో చేరేందుకు ఉద్యోగులు కార్యాలయం ముందు ఎదురు చూస్తున్నారు. జూన్ 9న ఏపీఎండీసీ, మైనింగ్ డైరెక్టర్ కార్యాలయాలను…
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ, యానాంలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం (జూన్ 26) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఈ అల్పపీడనం బలపడుతూ.. ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. అదే రోజున అల్పపీడనం ఏపీ తీరాన్ని తాకనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురవన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు వాతావరణం ఏర్పడనుంది.…
నేటి నుంచి రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.30కు సీఎం పర్యటన మొదలవనుండగా.. సాయంత్రం 4.35కు ముగుస్తుంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు ఈరోజు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగనుంది. సోమవారం మధ్యాహ్నం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చలు అసంపూర్ణం అవ్వడం…