Shocking Incident : తెలంగాణలో మానవత్వం మంటగలిసే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలిపై నమ్మకాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంటూ, హృదయ విదారకమైన పాశవిక చర్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన రోజా అనే యువతి తన స్నేహితురాలిని (26) ఇంటికి ఆహ్వానించి ఘోర మోసానికి పాల్పడింది. మద్యం తాగించి, ఆమెను మత్తులోకి నెట్టివేస్తూ, తన ప్రియుడు ప్రమోద్ చేత ఆమెపై అత్యాచారం చేయించింది. అంతేకాదు, ఈ దారుణ ఘటనను వీడియో…
Fake Baba: తెలంగాణ వ్యాప్తంగా ఆధ్యాత్మిక వేషధారణలో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఒక దొంగబాబా అరెస్ట్ అయ్యాడు. మెదక్ జిల్లాలో పట్టుబడ్డ ఈ నిందితుడు, తనను “బాపు స్వామి”గా పరిచయం చేసుకుంటూ, ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘోర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నిందితుడు తనను మహాత్ముడిగా చిత్రీకరించుకుంటూ, కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడితే తాను శక్తివంతమైన పూజలు చేసి నయం చేస్తానని నమ్మించాడు. తనను విశ్వసించిన మహిళలకు ప్రత్యేక…
HYDRA : హైడ్రా టార్గెట్ పేద, మధ్య తరగతి మాత్రమేనా అని ప్రశ్న.. ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా అని ప్రశ్నించిన హైకోర్టు.. మియాపూర్, దుర్గంచెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి? అందరికీ ఒకేలా న్యాయం జరిగితే హైడ్రా ఏర్పాటుకు సార్థకత అని పేర్కొన్న హైకోర్టు హైడ్రా కమిటీ విధానంపై మరోసారి హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పేద, మధ్య తరగతి ప్రజలకే హైడ్రా లక్ష్యమా? అనే ప్రశ్నను లేవనెత్తింది. ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఉందా? అనే…
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిధుల దుర్వినియోగంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. హెచ్‌సీఏ నిధుల అక్రమ లావాదేవీలకు సంబంధించి ఈడీ తాజాగా కొన్ని కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. హెచ్‌సీఏలో కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రో కో (Quid pro quo) వ్యవహారం చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యేకంగా హెచ్‌సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్‌పై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. సురేందర్ అగర్వాల్ తన హోదాను ఉపయోగించి హెచ్‌సీఏ…
లోకేష్ వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం: పాఠశాలల హేతుబద్ధీకరణపై సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుధం కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా వెనుకబడి పోయాయని, ‘నాడు-నేడు’ పేరుతో విద్యా వ్యవస్థను పతనావస్థకు చేర్చారని టీడీపీ సభ్యులు మండిపడ్డారు. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించిన మంత్రి లోకేష్ అన్నారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం…
నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు. ఇవాళ 14వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. క్వశ్చన్ అవర్‌తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు సీఐడీ కోర్టులో విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ వేశారు. గన్నవరంలో నేడు మంత్రి…
కేర్ హాస్పిటల్స్ సంచలనం: అత్యాధునిక కార్డియాక్ కేర్‌తో క్రిటికల్‌గా ఉన్న రోగికి కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాలను రక్షించింది. హైదరాబాద్‌లో గుండె పోటుతో బాధపడుతున్న 68 ఏళ్ల శ్రీమతి సుభాషిణి (పేరు మార్పు)కు విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. అత్యంత క్లిష్టమైన ఈ కేసు, అధునాతన కార్డియాక్ కేర్, వినూత్నమైన సాంకేతికతలు, మరియు మల్టీడిసిప్లినరీ విధానంతో ఎలా ప్రాణాలను రక్షించగలమో నిరూపించింది. రుమటాయిడ్ ఆర్థ్రిటిస్, ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్, కాలేజెన్…
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు: నేడు దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30కు విజయవాడ నుంచి ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు. సాయంత్రం 6.30కి సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కుమారుడి రిసెప్షన్‌కు హాజరవుతారు. ఈరోజు రాత్రికి ఇద్దరు ఢిల్లీలోనే బస చేస్తారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర…
నేడు అన్నవరానికి కలెక్టర్ షాన్ మోహన్ వెళ్లనున్నారు. ఆలయంలో జరుగుతున్న సంఘటనలు, ఇతర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ బాపట్ల జిల్లా మేదరమెట్లకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లనున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ బౌతిక ఖాయానికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 2023-24 ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ 28వ వార్షిక నివేదికను మంత్రి బీసీ జనార్దన్…
ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టా: జాతీయ ఉపాధి హామీ పథకంపై తాను ప్రత్యేక దృష్టి పెట్టానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతిని గుర్తించామని, రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, అవినీతి కి పాల్పడ్డ కొంతమందిని సస్పెండ్ చేశామన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్రం…