India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- యూరప్‌కు గణనీయంగా భారత్ డీజిల్ ఎగుమతులు..
- రష్యా, అమెరికాలను దాటి భారీ ఎత్తున సరఫరా చేస్తున్న ఇండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చమురు నిక్షేపాలు లేవు, విదేశాల నుంచే భారత్ చమురు దిగుమతి చేసుకుంటుంది. అయినా కూడా భారత్ యూరప్‌కు పెద్ద ఎత్తున డీజిల్ ఎగుమతి చేస్తుండటం విశేషం. రష్యా, అమెరికా నుంచి యూరప్‌కు డీజిల్ ఎగుమతులు తగ్గాయి. ఇప్పుడు ఈ రెండు దేశాలను దాటి యూరప్‌కు డీజిల్ అందించే కీలక శక్తిగా భారత్ ఎదిగింది. ఆగస్టులో బాబ్ ఎల్-మండేబ్ జలసంధి మీదుగా యూరప్‌కు వెళ్లిన డీజిల్‌లో సుమారు 60 శాతం భారత్ నుంచే వచ్చినట్లు Vortexa డేటా వెల్లడించింది. ఆగస్టులో యూరప్‌కు సుమారు 2 లక్షల బ్యారెళ్ల డీజిల్ సరఫరా అయ్యింది.
యూరప్‌కు ఒకప్పుడు రష్యా అతిపెద్ద, కీలక డీజిల్ సరఫరాదారుగా ఉండేది. ఉక్రెయిన్ యుద్ధం, రష్యాపై ఆంక్షలతో యూరప్‌కు వెళ్లే చమురు రవాణా తగ్గింది. ఆగస్టు తొలి 25 రోజుల్లో రష్యా సముద్ర మార్గ డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతులు రోజుకు సగటున 1.5 లక్షల బ్యారెళ్లకు పడిపోయింది. గతేడాదితో పోలిస్తే ఇది రోజుకు సుమారు 6.1 లక్షల బ్యారెళ్ల తగ్గుదల. ఐడేళ్లలో ఇది సగటున 81 శాతం క్షీణించినట్లు. రష్యాలోని రిఫైనరీలు, ఎక్స్పోర్ట్ ఫెసిలిటీలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తుండటంతో సరఫరా ప్రభావితమవుతోంది. జూలై, ఆగస్టు నెలల్లో రష్యాపై 32 డ్రోన్ దాడులు జరిగినట్లు డేటా వెల్లడించింది.
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
ఇక యూరప్‌కు మరో కీలక సరఫరాదారుగా ఉన్న అమెరికా నుంచి ఆగస్టు ద్వితీయార్థంలో ఎగుమతులు తగ్గాయి.గస్టు తొలి అర్ధభాగంలో రోజుకు దాదాపు 5.4 లక్షల బ్యారెళ్ల స్థాయిలో ఉన్న అమెరికా సరఫరాలు, రెండో అర్ధభాగంలో సుమారు 3.5 లక్షల బ్యారెళ్లకు పడిపోయాయి. అంటే దాదాపు 35 శాతం తగ్గుదల నమోదైంది. దీంతో రష్యా, అమెరికా సరఫరాల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి భారత రిఫైనరీలు పనిచేస్తున్నాయి.
భారత్‌కు అందివచ్చిన అవకాశం:
భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనరీగా ఉంది. దేశ రిఫైనరీ సామర్థ్యం ఏడాదికి 258.1 మిలియన్ టన్నులు. ఇది దేశీయ అవసరాల కన్నా ఎక్కువ. దీని వల్లే ఇతర దేశాలకు భారత్ పెట్రోలియం ఉత్పత్తుల్ని ఎగుమతి చేయగలుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 61.5 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసింది. రష్యా ఎగుమతుల్లో అంతరాయాలు, హార్ముజ్ మార్గంలో పరిమిత రవాణా, అమెరికా సరఫరా తగ్గడం వంటివి భారత్‌కు కలిసి వస్తు్ననాయి. యూరప్‌లో శీతాకాల డిమాండ్ పెరుగుతున్న సమయంలో యూరప్ ఇంధన నిల్వలు కూడా తక్కువ స్థాయిలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో భారత రిఫైనరీలపై యూరప్ ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!