CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఈ భేటీలో రాష్ట్రంలోని వివిధ ఆర్థిక, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, గత ప్రభుత్వం తీసుకున్న అధిక వడ్డీ రుణాలను రీస్ట్రక్చర్ చేయాలని, అలాగే, తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. గత ప్రభుత్వం ఇష్టారీతిగా అధిక వడ్డీలకు తీసుకున్న అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారాయని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ రుణాల చెల్లింపులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, వాటిని తిరిగి చెల్లించడానికి లోన్ రీస్ట్రక్చరింగ్‌కు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
Formula ERace : ఫార్ములా ఈ రేస్‌పై ఏసీబీ నివేదిక.. కేటీఆర్‌తో సహా అధికారులపై ఛార్జ్‌షీట్ సిద్ధం..!
తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి కేంద్రం అండగా నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యంగా, యంగ్ ఇండియా స్కూల్స్, ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి ₹30 వేల కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సుమారు 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే యంగ్ ఇండియా స్కూల్స్ పథకం ముఖ్య ఉద్దేశ్యం. రాష్ట్రంలోని 105 శాసనసభ నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని, ఇప్పటికే నాలుగు పాఠశాలల నిర్మాణ పనులు మొదలయ్యాయని, మిగతా పాఠశాలలకు సంబంధించి టెండర్లు ముగిశాయని ఆయన తెలిపారు. ఒక్కో పాఠశాలలో 2,560 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉందని, మొత్తం 2.70 లక్షల మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో లబ్ధి పొందుతారని చెప్పారు.
అత్యాధునిక వసతులు, ల్యాబ్‌లు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ₹21 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అలాగే, రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్‌లు, మౌలిక వసతుల కల్పనకు ₹9 వేల కోట్లు అవసరమని సీఎం తెలిపారు. ఈ నిధుల సమీకరణ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతించడంతో పాటు, FRBM పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించాలని కూడా ఆయన కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.
Supreme Court : భారత్-పాక్ మ్యాచ్‌ను నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్.. విచారణ ఎప్పుడంటే..?