2500 ఇటుకల బిల్లు రూ. 1.25 లక్షలు! ఉత్తర్ ప్రదేశ్ లోని భాటియా గ్రామ పంచాయతీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2500ల ఇటుకల బిల్లులో ఏకంగా రూ. 1.25 లక్షలు వేశారు. సర్పంచ్, కార్యదర్శి సంతకం చేసిన ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పరిపాలనలో కలకలం మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భాటియా గ్రామంలో ఒక బిల్లులో 2500 ఇటుకల ధరను రూ.1.25 లక్షలుగా చూపించిన కేసు వెలుగులోకి వచ్చింది, ఇది ప్రభుత్వ…
ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించాలి తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన చిట్ చాట్ జరిగింది. రేపు అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇద్దరు నేతలు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, “మా స్టార్ బ్యాట్స్‌మన్ నువ్వే” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి చెప్పగా, వెంటనే స్పందించిన కోమటిరెడ్డి, “మా కెప్టెన్ నువ్వే” అంటూ ఉత్తమ్‌ను…
తెలంగాణ విజిలెన్స్ కొత్త డీజీగా విక్రమ్ సింగ్ మాన్ తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ శాఖకు కొత్త డైరెక్టర్ జనరల్‌గా విక్రమ్ సింగ్ మాన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 31తో పదవీ విరమణ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన విక్రమ్ సింగ్ మాన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్)గా పనిచేస్తున్నారు.…
పాకిస్థాన్‌కు ఘోర అవమానం.. బోరున విలపించిన కెప్టెన్ సల్మాన్ అఘా! దుబాయ్ గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘాకు ఘోర అవమానం జరిగింది. అఫ్ఘానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న పాక్ సారథిని ఒక్కసారిగా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అటు నవ్వలేక, ఇటు ఏడ్వలేక అలా చూస్తూ ఉండిపోయారు. ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని వదలరుగా అంటూ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, సెప్టెంబర్…
ఏపీ రైతులకు శుభవార్త.. అతి త్వరలోనే..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. రాష్ట్రంలో పంట సాగు ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కొరత నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది. కేంద్ర రసాయనాలు అండ్ ఎరువుల శాఖ మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రైతులకు యూరియా అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను విశాఖపట్నంలోని గంగవరం పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ చేసింది. యూరియా…
నర్మాల గ్రామస్తుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించినందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను ప్రజలు ఎంతగానో కొనియాడుతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నర్మాల గ్రామంలో చిక్కుకుపోయిన ఐదుగురు గ్రామస్తులను సురక్షితంగా కాపాడటంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం.
KTR : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసి నీటమునిగితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీహార్ లో టైమ్ పాస్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం అర్ధిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో సీఎం అందుబాటులో ఉండాల్సింది పోయి.. బీహార్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. అసలు తెలంగాణకు సంబంధం లేని…
యూరియా సరఫరాపై తుమ్మల ఓపెన్ లెటర్.. కేంద్రం వైఫల్యంతో రైతులు ఇబ్బందులు తెలంగాణ రైతాంగానికి ఉద్దేశించి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ విడుదల చేశారు. యూరియా కేటాయింపులు, స్వదేశీ–దిగుమతి సరఫరాల్లో కేంద్ర ప్రభుత్వం సమన్వయ లోపం, అసమర్థత కారణంగా రాష్ట్రాలకు అవసరమైన పరిమాణం సమయానికి చేరడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించేందుకు ఎంతవరకైనా పోరాడుతామని హామీ ఇచ్చారు. లేఖలో ప్రభుత్వం ఇప్పటి వరకు పాత…
ఆ 25 ఎకరాల టీటీడీ భూమిని టూరిజం శాఖకు ఎలా ఇస్తారు..? అలిపిరి రోడ్డులోని రూ. 1500 కోట్లకు పైగా విలువ చేసే 25 ఎకరాల తిరుమల తిరుపతి దేవాస్థానం భూమిని టూరిజం శాఖకు ఎలా ఇస్తారు అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. టీటీడీ బోర్డు మీటింగ్ లో మా అభ్యంతరాలను తిరస్కరించారు.. దేవుడు భూమిని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదా.. 25 ఎకరాల టీటీడీ ల్యాండ్ ను టూరిజం…
Gurukulam : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఘటన ఒక్కసారిగా విద్యా వర్గాలను, తల్లిదండ్రులను, ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గురుకుల పాఠశాలలోనే కొందరు సిబ్బంది తమ కక్షసాధింపుకై తాగునీటిలోనే పురుగుల మందు కలపడం కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పరిధిలోని ఒక గురుకుల పాఠశాలలో ఈ దారుణం జరిగింది. పాఠశాలలో ప్రత్యేక అధికారి (Special Officer) పట్ల కక్ష పెంచుకున్న నలుగురు సిబ్బంది ఆవేశపూరితంగా తాగునీటిలో పురుగుల మందు కలిపినట్టు…