త్రిముల్‌గేరీ సరస్సు , చుట్టుపక్కల నివసించే ప్రజలు తరచుగా కురుస్తున్న వర్షాల కారణంగా సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న నీటి వనరుల అభివృద్ధి పనులను చేపట్టడానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (SCB) శాశ్వత మార్గం కల్పించకపోవడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. రింగ్ సీవర్ లైన్ నిర్మాణం, మురుగునీటిని సరస్సులోకి మళ్లించాలంటూ ఎన్నిసార్లు విన్నవించినా నేటికీ చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా మలానీ ఎన్క్లేవ్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాలనీ, పద్మనాభ కాలనీ, సూర్య అవెన్యూతో…
విద్యార్థులు మధ్య చిన్న ఘర్షణ ప్రాణాలు తీసుకునేందుకు తెలుత్తుతున్నాయి. చిన్న చిన్న మాటలకు జీవితాన్ని నాసనం చేసుకునేందుకు కూడా వెనుకాడటం లేదు పసి ప్రాణాలు. చిన్న వయస్సులో ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావడంలేదు. సెల్ ఫోన్ మహత్యమా.. లేక సినిమాల ప్రభావమో. ఒక విధ్యార్థి తోటి విద్యార్థిని బిర్యానీ ప్యాకెట్ చూశావా అని అడినందుకు మరో విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు పాల్పడిన విచిత్ర ఘటన నాగర్ కర్నూల్ జిల్లా…
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, యాదాద్రి, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో.. వికారాబాద్, శంకర్‌పల్లిలో వరదనీరు చేరింది. దీంతో.. గండిపేట జలాశయానికి భారీగా వరద నీరు…
సాధారణంగా యువకులకు బెదిరింపులకు దిగడం.. డబ్బులు వసూలు చేసిన ఘటనలు వెలుగు చూస్తుంటాయి.. అయితే, వరంగల్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువతకులు రోడ్లపై కనిపిస్తున్నారు.. సిటీలో తిరుగతూ.. యువకులను బెదిరిస్తున్నారు.. పేదవారికి సహాయం చేయండి అని అడుగుతూ.. ఏదో స్వచ్ఛందం సంస్థల పేర్లు చెబుతూ గట్టిగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.. అనుమానం వచ్చిన స్థానికులు వారిని నిలదీశారు.. మొబైల్ ఫోన్లలో వారిని ఫొటోలు, వీడియోలు తీయడంతో అక్కడి నుంచి జారుకున్నారు.. వరంగల్ సిటీలో జరుగుతోన్న ఈ…
జేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బోధన్ ఎమ్మెల్యే షకీల్ ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధిపై రాజాసింగ్‌కు ఏమాత్రం అవగాహన లేదని ఆయన విమర్శల వర్షం గుప్పించారు. గోషామహల్ గుడుంబా కింగ్ రాజాసింగ్ అంటూ ఆరోపించారు.
తెలంగాణ రాజకీయాల్లో జగ్గారెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఎప్పుడూ ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండే ఆయన.. తాజాగా బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి సరదాగా గడిపారు.
ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్ ఇప్పుడు దేశంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు గుర్తించారు.
అభివృద్ధి, సంక్షేమ పనులన్నింటినీ సిద్దిపేటకే తీసుకెళ్తావని తనని తిడతారని.. కానీ వేరే విషయంలో తనను ఏమీ అనరని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట ప్రజలు తన కుటుంబసభ్యులతో సమానమని మంత్రి వెల్లడించారు. సిద్దిపేట పట్టణంలో కొండ భూదేవి గార్డెన్లో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల జిల్లా సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రధాని మోడీ తల్లి పాల మీద తప్ప అన్నింటిపై పన్నులు వేశారని.. మోడీ పనుల ప్రధాని కాదు పన్నుల ప్రధాని అని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్లో చేరారు. మంత్రి ఆధ్వర్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
దేశ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మును తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రతినిధి, రిటైర్డు ఐఏఎస్ అధికారి రామచంద్రు తేజావత్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రజలు, దేశవ్యాప్తంగా ఆదివాసీల తరపున శుభాకాంక్షలు తెలిపారు. ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.