తెలంగాణలో ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రంపై టీఆర్ఎస్ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రుల సమావేశం ముగిసింది. అరగంటపాటు సాగింది ఈ సమావేశం. పంజాబ్ నుంచి ఏ తరహాలో అయితే బియ్యాన్ని కేంద్రం సేకరిస్తుందో, తెలంగాణ నుంచి కూడా అదే తరహాలో బియ్యాన్ని సేకరిస్తుంది. ఏ రాష్ట్రం పట్ల కేంద్రం ఎలాంటి వివక్షతతో వ్యవహరించదన్నారు కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.…
తెలంగాణ సర్కార్-కేంద్ర సర్కార్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.. యాసంగిలో పడించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో… తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ చేరుకుంది. వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌లు… ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర మంత్రులను కలిసి… ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. వన్ నేషన్-వన్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ రూపొందించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. Read Also: TS RTC: ఆర్టీసీకి…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. మంత్రులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు.. ఎర్రవెల్లిలోని తమ ఫామ్‌హౌస్‌కి రావాలంటూ ఆయన నుంచి మంత్రులకు సమాచారం వెళ్లింది.. అయితే, ఆకస్మాత్తుగా భేటీ కావడంతో.. ఏ అంశాలపై చర్చిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ భేటీలో మంత్రులతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫోన్ కాల్ రావడంతో.. హుటాహుటిన తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని.. ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి,…
ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు… రేపు పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలవనున్నారు. మరోసారి కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి ఖరీప్ సీజన్ లో పండే వరిధాన్యం కొనుగోలుపై స్పష్టత కోరనున్నారు తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం. ప్రస్తుతం ముంబైలో ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రేపు ఢిల్లీ కి వచ్చిన తర్వాత, తెలంగాణ నేతల బృందం భేటీ అయ్యే అవకాశం…
తెలంగాణ నుంచి కేంద్రం ధాన్యం కొనుగోలు వ్యవహారంపై మరోసారి కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం భేటీ కానుంది. కృషి భవన్ లో రాత్రి 7.30 గంటలకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తో భేటి కానున్న రాష్ట్ర మంత్రుల బృందం సమావేశం కానుంది. ఈ భేటీకి హాజరుకానున్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక…
కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పీయూష్ గోయల్ తో ఈ బృందం సమావేశమైంది. ఈ సమావేశం లో మంత్రి కేటీఆర్ తో పాటు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, ఎంపీలు, కేంద్ర అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్ల అంశం పై కేంద్రం…
తెలంగాణ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రులు అనవసరంగా సీఎం జగన్ పై నిందలు వేస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసింది మాజీ సీఎం చంద్రబాబు. చంద్రబాబు జి ఓ 69 తెచ్చి రాయలసీమకు అన్యాయం చేశారు. 800 అడుగులు వద్ద విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు అని తెలిపారు. 254 టీఎంసీలు అనుమతులు లేకుండా నీటిని తరలిస్తున్నారు. ఫిర్యాదు చేస్తే కేంద్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణ…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైన జల వివాదం.. చినికి చినికి గాలివానగా మారుతూనే ఉంది.. ప్రధానికి, కేంద్రానికి, కృష్ణా రివర్ బోర్డుకు తాజాగా ఏపీ లేఖలు రాయడంపై భగ్గుమంటున్నారు తెలంగాణ మంత్రులు, నేతలు.. ఆ విమర్శలపై స్పందించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తెలంగాణ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయారు.. అక్కడా తెలుగువాళ్లున్నారు… ఇక్కడా తెలుగువాళ్లున్నారని.. బూతులు తిట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ…
ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ను తెలంగాణ మంత్రులు కోరారు. ఈమేరకు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత, బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌కు బుధవారం దిల్లీకి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. మేడారం జాతరకు ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు వెచ్చిస్తోందని, కేంద్రం నుంచి కూడా…