Hyderabad: హైదరాబాద్‌లో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. ఆధిపత్యం, పాతకక్షల నేపథ్యంలో ఒకరినొకరు హత్యలు చేసుకుంటున్నారు. ఎప్పుడు ఎక్కడ హత్య జరుగుతుందో తెలియక సామాన్య జనం హడలి పోతున్నారు. హైదరాబాద్‌లో ఎల్లమ్మబండలో తాజాగా జరిగిన రౌడీషీటర్ హత్య కలకలం రేపుతోంది. ఎల్లమ్మబండలోని గుడ్ విల్ హోటల్‌లో మహబూబ్ అనే రౌడీ షీటర్ టీ తాగడానికి వచ్చాడు. అతని రాకపై సమాచారం తెలుసుకున్న ప్రత్యర్థులు రంగంలోకి దిగారు. అప్పటికే మర్డర్ ప్లాన్ వేసిన ముగ్గురు నిందితులు ఆటోలో అక్కడి చేరుకున్నారు. రావడమే…
Medak murder case: మెదక్ జిల్లా మగ్దుంపూర్‌లో యువకుడి డెడ్ బాడీకి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. మైనర్ అమ్మాయి న్యూడ్ వీడియోలు, ఫోటోలు దగ్గర ఉంచుకుని బెదిరించడమే హత్యకు కారణంగా గుర్తించారు. యువకున్ని హైదరాబాద్ బోరబండకు చెందిన సబిల్‌గా నిర్ధారించారు. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు సబిల్. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్లాపూర్‌లో ఓ మెకానిక్ షెడ్‌లో మెకానిక్‌గా పని చేశాడు.
Kidnap : హనుమకొండలో మైనర్ బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం ఓ మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని హనుమకొండ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిందితుల చెరలో ఉన్న బాలుడిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుల్లో ప్రధాన అనుమానితురాలు పూరి పద్మ గతంలో బ్రాహ్మణవాడలోని క్యాటరింగ్ మాస్టర్…
కోరుట్ల చిన్నారి హితిక్ష మర్డర్ కేసులో కొత్త కోణం బయటపడింది. హితిక్షను కుటుంబసభ్యురాలే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ప్రస్తుతం పిన్ని మమత పోలీసుల అదుపులో ఉంది. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. మమత ఒక్కతే హత్యకు పాల్పడిందా..? ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలను ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్‌లో వరుస హత్యలు సంచలనం రేపుతున్నాయి.. ఒకే రోజు మూడు హత్యలు వెలుగు చూశాయి. మూడు హత్యలూ అనుమానాస్పదమే !! కూకట్‌పల్లిలో బర్త్‌డే పార్టీకని పిలిచి ఓ యువకుడిని హత్య చేయగా... నాగోల్‌లో జూస్ సెంటర్ నిర్వాహకుడిని దారుణంగా హత్య చేశారు. బహదూర్‌పురలో ఓ యువకుడిని హతమార్చారు గుర్తుతెలియని వ్యక్తులు. వరుస హత్యలకు కారణమేంటి..? మూడు హత్యల్లో దాగున్న మిస్టరీ ఏంటి...?
బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, ఎద్దులను కోయకుండా సీఎం, డీజీపీ చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. పండుగ ఎలా జరుపుకుంటారో తమకు అనవసరమని.. కానీ పశువులను కోస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే తాము బాధ్యులం కాదని తేల్చిచెప్పారు. పశువుల రవాణాలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.
ఉప్పరపల్లి గౌతమ్ నగర్ లో ఎస్‌బీ ఇన్స్పెక్టర్ పై దాడి జరిగింది. చార్మినార్ అగ్ని ప్రమాద ఘటనలో ఒకే కుటుంబంలో పదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల వివరాలు నోట్ చేస్తుండగా ఆగ్రహంతో సీఐపై మృతుల బంధువుల దాడి చేశారు. మీడియాను మృతుల కుటుంబ సభ్యులు అనుమతించలేదు. గౌతమ్ నగర్ కు వెళ్లిన మీడియా, పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మావోయిస్టు పార్టీ లో ఉన్న తెలంగాణ వాసులందరూ లొంగిపోవాలని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.. తెలంగాణ పోలీసులు కర్రెగుట్టలో ఎలాంటి ఆపరేషన్స్ నిర్వహించట్లేదని స్పష్టం చేశారు.. కేంద్ర బలగాల నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.. వెంకటాపురం ఏరియాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని కేంద్ర బలగలు మోహరించి ఆపరేషన్ నిర్వహిస్తున్నారన్నారు..
Duddilla Sridhar Babu : రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, పోలీసు విభాగాన్ని మరింత సమర్థంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సైబర్ నేరాల అదుపు కోసం ఇప్పటికే పోలీసు…