ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే.. అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.
రాష్ట్ర వైద్య విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వెయ్యికి పైగా తెలంగాణ విద్యార్థులకు ఎంబీబీఎస్ బీ కేటగిరి సీట్లు కెటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్- బి కేటగిరీ సీట్లలో కేటాయించే 35శాతం సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కేలా అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Bathukamma Festival: తెలంగాణలో ఈరోజు నుంచి బతుకమ్మ పండగ సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతి ఏడాది బతుకమ్మ పండగ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 9 రోజులపాటు ఈ వేడుకలు జరగబోతున్నాయి. తొలిరోజు ఎంగిలిపూలతో బతుకమ్మ పండుగ మొదలయ్యి చివరిరోజు సద్దుల బతుకమ్మతో వేడుకలు పరిసమాప్తమవుతాయి. ఈనేపథ్యంలో.. లంగాణ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
Flood of Godavari and Krishnamma: రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో కృష్ణానదిపై వున్న శ్రీశైలం జలాశయానికి 2,36,513 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఈనేపథ్యంలో.. అధికారులు ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 2,56,607 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇక.. ఇప్పుడు 884.30 అడుగుల…
తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్చ పొందడానికి ఆనాటి యావత్ సమాజం ఉద్యమించిందని..ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలుస్తాయని ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల కలెక్టరేట్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో వైభవంగా నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ పరోక్షంగా చురకలంటించారు. ఓ కేంద్రమంత్రి 74 ఏళ్ల…
Telangana National Unity Vajrotsavam: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు (శుక్రవారం) రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 15 వేల మందితో జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలు నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…
Minister ktr will visit tankbund shiva home-soon: ట్యాంక్ బండ్ శివ అదేనండి శవాల శివ ఈయన గురించి హైదరాబాద్ లో చాలా మందికి తెలుసు, ఎన్నో ఏళ్లుగా ట్యాంక్‌బండ్ వద్దే ఉంటున్నారు. పలు కారణాలతో హుస్సేన్ సాగర్ లో పడి ఆత్మహత్యాయత్నం చేసుకొనే వారికి ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలను ఆయన కాపాడారు. అంతేకాదు.. ట్యాంక్ బండ్ లో చనిపోయిన వారి శవాలను సైతం తన చేతులతో బయటకు తీశారు. హుస్సేన్ సాగర్…
తెలంగాణలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తడిసి ముద్దవుతున్న రాష్ట్ర ప్రజలకు మరో షాక్ తగలనుంది. తెలంగాణాకు రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు…
Gangster Ayub Khan Released: ఐదేళ్ల చంచల్ గూడ జైల్లోనే విడుదలైన పాతబస్తీ గ్యాంగ్ స్టర్ అయూబ్ ఖాన్ ఇవాళ విడుదలయ్యాడు. నకిలీ పాస్‌పోర్టు కేసుకు సంబంధించి అరెస్టయిన పాతబస్తీ గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్ జైలు నుంచి నేడు విడుదలయ్యాడు. గతంలో.. 2017లో సౌదీ అరేబియా నుంచి నకిలీ పాస్పోర్టుతో వచ్చాడనే కారణంతో ముంబయి ఇమ్మిగ్రేషన్ అధికారులు అయూబ్‌ఖాన్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. దీంతో.. అయూబ్‌కు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించగా, సుమారు ఐదేళ్లుగా…
Central Ministers Telangana Tour: పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. నేటి నుంచి మూడు రోజుల పాటు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు బీజేపీ వెల్లడించింది. 3,4, తేదీల్లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈపర్యటనలో భాగంగా పేద, బడుగు బలహీన వర్గాలకు…