Flood of Godavari and Krishnamma: రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో కృష్ణానదిపై వున్న శ్రీశైలం జలాశయానికి 2,36,513 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఈనేపథ్యంలో.. అధికారులు ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 2,56,607 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇక.. ఇప్పుడు 884.30 అడుగుల వద్ద నీరు ఉన్నది.
దీంతో.. ప్రాజెక్టులో 215.80 టీఎంసీలకు గాను 211.47 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది. అయితే.. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో అధికారులు 14 గేట్లను 10 అడుగుల మేర ఎత్తివేశారు.. దీంతో.. ప్రాజెక్టుకు ఎగువనుంచి 2.51 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. కాగా.. వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు వుంది.. ఇప్పుడు 588 అడుగుల వద్ద నీరు ఉన్నది. ఇక ప్రాజెక్టులో మొత్తం 312 టీఎంసీల నీరు నిల్వ ఉంచవచ్చని అంచనా.. ప్రస్తుతం 307 టీఎంసీల నీరు ఉంది.
JDU: ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త కాదు వ్యాపారవేత్త.. జేడీయూకు అవసరం లేదు