KTR counter to Amit Shah: అప్పట్లో పటేల్ విలీనం కోసం.. ఇప్పుడు అమిత్ షా విచ్ఛిన్నం కోసం వచ్చిండు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్చ పొందడానికి ఆనాటి యావత్ సమాజం ఉద్యమించిందని..ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలుస్తాయని ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో వైభవంగా నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ పరోక్షంగా చురకలంటించారు.
ఓ కేంద్రమంత్రి 74 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రజలను భారత యూనియన్ లో విలీనం చేసి సమైక్యతను చాటారు. ఈ రోజు ఓ కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను విభజించి, బెదిరింపులకు పాల్పడేందుకు వచ్చారని ఆరోపించారు. అందుకే దేశానికి కావల్సింది నిర్ణయాత్మక విధానాలేనని, విభజన రాజకీయాలు కావని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై పలు కామెంట్లు చేశారు. ఎన్నికల ప్రచారంలో.. ఉద్యమాల్లో హామీ ఇచ్చారని కానీ అమలు చేయలేదని పరోక్షంగా కేసీఆర్ సర్కార్‌ను విమర్షించిన అమిత్ షా.. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించలేదని మండిపడ్డారు. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని అన్నారు. అయితే.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుందనే, వివిధ పేర్లతో కొందరు విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అయితే.. ఎవరి త్యాగాల వల్ల అధికారంలో ఉన్నారో, వారికి శ్రద్ధాంజలి వహించకపోతే తెలంగాణకు ద్రోహం చేసినట్లు అని, పరోక్షంగా కేసీఆర్ ను విమర్శించారు. ఈఏడాది హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారని అమిత్ షా పేర్కొన్నారు.
Also Read
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
74 years ago, A Union Home Minister came to UNITE & INTEGRATE The People of
Telangana into Indian unionToday A Union Home Minister has come to DIVIDE & BULLY
The People of Telangana & their state GovtThat’s why I say, India needs
DECISIVE POLICIES Not
DIVISIVE POLITICS— KTR (@KTRTRS) September 17, 2022
తాజావార్తలు
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!