Hyderabad Rain Alert: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే.. అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మూడు రోజుల పాటు మళ్ళీ వారణుడు తన ప్రతాపాన్ని చూపనున్నాడు. కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వానతో పాటు కొన్నిచోట్ల పిడుగులు కూడా పడతాయని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల10 వరకు చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Read also: Mallikarjun Kharge Visit Hyderabad: నేడు హైదరాబాద్ కు మల్లికార్జున ఖర్గే.. గాంధీభవన్ లో సమావేశం
కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో రెండురోజులుగా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. మిగతా జిల్లాలకు యెల్లో అలర్ట్‌ను ప్రకటించింది. వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేఅవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, చొప్పడండి మనకొండూర్ నియోజకవర్గముల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తుంది. పలు చోట్ల రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.
Blast in Police Station: పోలీస్‌స్టేషన్‌లో అర్ధరాత్రి భారీ పేలుడు..