ద్వైపాక్షిక సహకారం ద్వారా నైపుణ్యాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకొని ఉమ్మడి పురోగతి వైపు కలిసి అడుగేద్దామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
Duddilla Sridhar Babu : తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుకు లైఫ్ సైన్సెస్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా పరిగణించే ‘ASB Biotech International Conference 2025’లో ఆయన కీలకోపన్యాసకుడిగా ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ ఆహ్వానించారు. Saidabad Case : సైదాబాద్ జువైనల్ హోంలో మరో లైంగిక దాడి వెలుగులోకి దేశంలో ఈ గౌరవాన్ని పొందిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు…
Minister Sridhar Babu : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంచిర్యాల జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ల అమలుపై కట్టుబాటుతో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉత్తమ భోజనం, మెరుగైన…
హైదరాబాద్‌లో 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు (Podcast With NTV Telugu)లో ఆయన ప్రభుత్వ విధానాలను వివరించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనాలిటిక్స్ వంటి కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. మంత్రి వివరణ ఆయన మాటల్లోనే.. రాబోయే కాలంలో క్వాంటం కంప్యూటింగ్ కి సంబంధించిన అంశాలు కూడా దృష్టిలో పెట్టుకుని రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి రావడానికి…
Duddilla Sridhar Babu : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తాజాగా NTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్తరణపై కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ ఇంటర్నెట్, టెలిఫోన్, కంప్యూటర్ సేవలను తక్కువ ధరలో అందించేందుకు ప్రభుత్వం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. “ఇప్పటి వరకు ఉన్న T-Fiber సేవలను మరింత విస్తరించి, నూతన సర్వీసులు జత చేస్తూ T-NXTగా ఆవిష్కరిస్తున్నాం,” అని మంత్రి చెప్పారు. ప్రతి ఇంటికి…
Duddilla Sridhar Babu : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తాజాగా T-ఫైబర్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల ప్రజలందరికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. శ్రీధర్ బాబు పేర్కొన్నదానినిబట్టి, ఇప్పటికే దాదాపు 20 జిల్లాల్లో ఫైబర్ కనెక్టివిటీ కార్యక్రమం తుది దశలో ఉంది. త్వరలోనే ఆ ప్రాంతాలకు సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. “ఇంటర్నెట్, టెలిఫోన్, టెలివిజన్…
విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో గణనీయ వృద్ధిని సాధించిన రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణపనులకు శ్రీకారం చుట్టింది. గురువారం నాడు శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్ లో ఈ సంస్థ కొత్త కర్మాగారం నిర్మాణానికి ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసారు. రూ.300 కోట్ల వ్యయంతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ పరిశ్రమ రానున్న మూడేళ్లలో 1200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా శ్రీధర్…
ఈమధ్య హ్యాకర్లు మరింత రెచ్చిపోతున్నారు. ఏకంగా ప్రభుత్వాలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలనే హ్యాక్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఐటీ మినిస్ట్రీ ట్విటర్ ఖాతాను...