Duddilla Sridhar Babu : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తాజాగా T-ఫైబర్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల ప్రజలందరికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. శ్రీధర్ బాబు పేర్కొన్నదానినిబట్టి, ఇప్పటికే దాదాపు 20 జిల్లాల్లో ఫైబర్ కనెక్టివిటీ కార్యక్రమం తుది దశలో ఉంది. త్వరలోనే ఆ ప్రాంతాలకు సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
“ఇంటర్నెట్, టెలిఫోన్, టెలివిజన్ కనెక్టివిటీలను ఒకే చాట్లో కలిపి అందించడం T-ఫైబర్ ప్రత్యేకత. దేశవ్యాప్తంగా ఇదే తరహా సేవలు అందించే తొలి ప్రాజెక్టుగా T-ఫైబర్ నిలుస్తుంది,” అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 43,000 కిలోమీటర్లకు పైగా ఫైబర్ కేబుల్ విస్తరించబడిందని, ఇది నిజంగా గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. అయితే, అటవీ ప్రాంతాల్లో పని చేపట్టేందుకు కేంద్ర అటవీ శాఖ నుండి కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు.
మరింత మందికి ఈ సేవలు చేరాలంటే ధర పరంగా అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో T ఫైబర్, T నెక్స్ట్ సేవలను అతి తక్కువ ధరకు అందించేందుకు ప్రభుత్వ ఆలోచనలో ఉందని వివరించారు. “మరో ఆరు నెలల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రతి ఇంటికీ ఫైబర్ కనెక్టివిటీతో పాటు స్మార్ట్ టీవీ సేవలను కూడా అందించాలన్నది మా లక్ష్యం,” అని మంత్రి స్పష్టం చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, “T ఫైబర్ ఉద్యోగులు అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించేందుకు నిరంతరం కృషి చేయాలి” అని సూచించారు.
PM Modi: రేపు వారణాసిలో మోడీ పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన