YS Jagan: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదంపై తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం పూర్తి సామర్థ్యం 885 అడుగులు.. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో 44 వేల క్యూసెక్కుల నీరు కిందకు రావాలంటే 881 అడుగులు ఉంటే కానీ కిందకు రాదు.. 854 అడుగులకు తగ్గితే కేవలం 7 వేల క్యూసెక్కులు మాత్రమే వస్తాయి.. గడచిన 20 ఏళ్లలో కేవలం మూడు, నాలుగు సార్లు మాత్రమే కేటాయింపులకు సరిపడ్డా నీళ్లు కిందకు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రాయలసీమ లిఫ్ట్ అవసరమైంది.. శ్రీశైలం లో 802 అడుగుల నుంచే నీళ్లు తోడుకుని వెళ్ళటానికి తెలంగాణ ప్రభుత్వం పనులు ప్రారంభించింది.. 800 అడుగుల లోపు ఉన్నా తీసుకెళ్ళడానికి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు మొదలు పెట్టారని జగన్ పేర్కొన్నారు.
Read Also: YS Jagan: రాయలసీమ లిఫ్ట్ను ఆపించామని తెలంగాణ సీఎం అసెంబ్లీలో చెప్పారు.. చంద్రబాబు మాపై ఆరోపణలా..?
అయితే, శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రాక ముందే జూరాల నుంచి పలు ప్రాజెక్టుల ద్వారా నీటిని తెలంగాణ తరలిస్తుందని మాజీ సీఎం జగన్ తెలిపారు. 777 అడుగుల నుంచి శ్రీశైలం ఎడమ వైపున ఉన్న పవర్ హౌస్ ద్వారా రోజుకు నాలుగు టీఎంసీల నీళ్లు ఖాళీ చేస్తున్నారు.. నీళ్లు లేక రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు.. లిఫ్ట్ ల ద్వారా, పవర్ హౌస్ ల ద్వారా రోజుకు 8 టీఎంసీల నీళ్లను తెలంగాణ సర్కార్ ఖాళీ చేస్తుంది.. తెలంగాణ కిందికి వదిలేస్తున్న నీటిని అడ్డుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామని ఎద్దేవా చేశారు. అలాగే, నాగార్జున సాగర్ లెఫ్ట్ ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి.. మొన్నటి దాకా మన భూభాగంలో ఉన్న కుడి కాలువ ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్లిపోయాయి.. తెలంగాణలో ఎన్నికలు అయ్యాక మనం తిరిగి తీసుకున్నాం.. నాగార్జున సాగర్ కింద ఉన్న పులిచింతల ప్రాజెక్టు కుడి కాలువ కూడా వారి కిందనే ఉందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు.
Read Also: TOXIC : యష్ బర్త్ డే స్పెషల్.. టాక్సిక్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్.. కొంచం యాక్షన్.. మరికొంత ఓవరాక్షన్
ఇక, రాష్ట్ర విభజన తర్వాత ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నోరు మెదపలేక అన్నీ వదిలేశారు అని మాజీ సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు మౌనంగా ఉండటం వల్ల శ్రీశైలం ఎగువ భాగంలో తెలంగాణ అనేక ప్రాజెక్టుల పనులు స్పీడ్ చేసిందని గుర్తు చేశారు. తెలంగాణలోని ఏ ప్రాజెక్టుకు కూడా పర్యావరణ అనుమతులు లేవు.. మా హాయంలో ఆ పనులు ఆపాలని ఎన్జీటీ ఆదేశించినా పట్టించుకోలేదని తెలిపారు. ఎన్జీటీ తెలంగాణకు రూ. 920 కోట్ల జరిమానా కూడా విధించింది.. తెలంగాణ 777 అడుగుల నుంచి 850 అడుగులలోపు ఉన్నప్పుడే రోజుకు 8 టీఎంసీల నీళ్లు ఖాళీ చేస్తున్నారని ఆరోపించారు. 885 పూర్తి స్థాయి నీళ్లు అయితే 834 అడుగుల దగ్గర ఇక చిన్న లిఫ్ట్ ఉంది.. 794 దగ్గర ఒక లిఫ్ట్ అందుబాటులో ఉంది.. మనం రోజుకు 0.6 టీఎంసీ ల నీళ్లు మాత్రమే వాడుకోగలం.. ఈ రకంగా నీళ్లు వాడుతుంటే ఎప్పుడు నీళ్లు వస్తాయి.. ఎప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుందని జగన్ ప్రశ్నించారు.