Housing Lands : ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసే కబ్జాదారుల ఆటలికసాగవు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు, డెక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (దిల్) భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అవలంబిస్తుంది. ఒకవైపు ఉన్న భూములను పరిరక్షిస్తూనే మరోవైపు గతంలో ఆక్రమణలకు గురైన భూములను తిరిగి దక్కించుకునేందుకు నడుం బిగించింది. అలాగే ఈ దిశగా ఇప్పటికే చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అల్పాదాయ, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు ఇళ్లు నిర్మించేందుకు…