CM Revanth Reddy: హైదరాబాద్ నగర ప్రజలను వర్షాలు వదలడం లేదు. ఇటీవల కురిసిన కుంభవృష్టి నుంచి తేరుకోకముందే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జీహెచ్ఎంసీ పరిధిలో కుండపోత వర్షం పడింది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం సుమారు 4 గంటలుగా కురుస్తోంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో రోడ్లు మునిగిపోయాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జగిత్యాల జిల్లా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెరువులు పొంగిపొర్లి గ్రామాలపై విరుచుకుపడుతుండటంతో పరిస్థితి దారుణంగా మారింది. రహదారులు దెబ్బతినగా, చిన్న చిన్న కాలువలు కూడా నదుల్లా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
సిద్దిపేటలో వర్షం తీవ్రంగా కురుస్తోంది. కోమటిచెరువు నాలా ఉప్పొంగడంతో పట్టణం జగదిగ్బంధంలో చిక్కుకుంది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్ష ప్రభావం కారణంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రేపు, ఎల్లుండి (ఆగస్టు 29, 30) సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది.
Bandi Sanjay : తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురుస్తున్న అతిభారీ వర్షాలతో రెండు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట వద్ద మానేరు వాగులో ఐదుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. దాంతో పాటు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కలిపి 30 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కుమార్ చొరవ చూపించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు…
Medak – Kamareddy : తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో అధికారులు ఈ రెండు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. కామారెడ్డిలో 41 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అటు మెదక్ లోనూ వర్షాల ఉధృతి ఆగట్లేదు. ఈ రెండు జిల్లాల్లోని చెరువులు అన్నీ మత్తడి దుంకుతుండగా.. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా ఊర్లు నీటమునిగాయి. రోడ్లు తెగిపోయాయి. పదుల…