Hens Death : భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలం అవుతోంది. ఎక్కడ చూసినా వరద నీళ్లే కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. పట్టణాల్లో కాలనీలు చెరువుల్లాగా కనిపిస్తున్నాయి. నిజాంపేట (మం) నందిగామ గ్రామం నీట మునిగింది. ఈ గ్రామంలోని పౌల్ట్రీ ఫాంలోకి భారీగా వరద నీరు చేరింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఫాంలోని సుమారు 10 వేల కోళ్లు నీటిలో మునిగి చనిపోయాయి. సుమారు 14 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు పౌల్ట్రీ ఫారం యజమాని…
మెదక్ జిల్లా తూప్రాన్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షానికి గాయత్రి నగర్ కాలనీ, ఏబీ కాలనీతో పాటు పలు కాలనీలు జలదిగ్బంధానికి గురయ్యాయి. భారీ వరదతో ఇళ్లు నీటమునిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
IMD Issues Red Alert for 4 Districts in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరో పదకొండు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ…
రాష్ట్రంలో వర్షాల పరిస్థితి మరింత తీవ్రమవుతున్న నేపధ్యంలో, వాతావరణ శాఖ రాబోయే మూడు రోజులకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండగా, రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత ఉధృతమవుతుందని అంచనా వేస్తోంది.
TS Heavy Rains: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Telangana Rains: తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు లేవు. జూలై చివరి వారంలో వర్షాలు కురిసినా ఆగస్టు ప్రారంభం నుంచి వరుణుడి జాడ లేదు. రైతులకు ఆగస్టు చాలా ముఖ్యమైన నెల.
Talangana Rains: హైదరాబాద్ లో రాగల మూడు గంటలు చిరు జల్లులే పడే అవకాశం ఉందని, భారీ వర్షం పడే అవకాశాలు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రం వరకు నగరానికి భారీ వర్షం లేదని వాతావరణ నిపుణులు తెలపడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
TS Heavy Rain: గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. కాళేశ్వరం సమీపంలో గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి.