Medak – Kamareddy : తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో అధికారులు ఈ రెండు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. కామారెడ్డిలో 41 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అటు మెదక్ లోనూ వర్షాల ఉధృతి ఆగట్లేదు. ఈ రెండు జిల్లాల్లోని చెరువులు అన్నీ మత్తడి దుంకుతుండగా.. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా ఊర్లు నీటమునిగాయి. రోడ్లు తెగిపోయాయి. పదుల కొద్దీ ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి పట్టణంలోని పది కాలనీలు నీట మునిగాయి.
Read Also : Heavy Rains : రాబోయే రెండు గంటలు అత్యంత భారీ వర్షాలు
కార్లు, బైకులు కొట్టుకుపోతున్నాయి. మెదక్ లోని అన్ని మండలాల్లో వాగులు పొంగిపొర్లుతుండగా.. 12 మంది వరదల్లో చిక్కుకున్నారు. ఇందులో ఒకరిని కాపాడారు. ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రేపు ఉదయం 8 గంటల వరకు ఈ రెడ్ అలెర్ట్ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే 24 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని.. అత్యవసరం అయితే తప్ప బయట తిరగొద్దు అంటున్నారు. ఏదైనా అవసరం వస్తే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని సూచిస్తున్నారు.
Read Also : Hens Death : పౌల్ట్రీఫాంలోకి వరద నీరు.. 10వేల కోళ్లు మృతి