Telangana Rains : సిద్దిపేటలో వర్షం తీవ్రంగా కురుస్తోంది. కోమటిచెరువు నాలా ఉప్పొంగడంతో పట్టణం జగదిగ్బంధంలో చిక్కుకుంది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్ష ప్రభావం కారణంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రేపు, ఎల్లుండి (ఆగస్టు 29, 30) సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెలవులను మరో రెండు రోజులు పొడిగించింది. అందువల్ల విద్యార్థులకు రేపు, ఎల్లుండి పాఠశాలలు, కళాశాలలు బంద్ కానున్నాయి.
Daniil Medvedev: ప్రేక్షకులతో అనుచిత ప్రవర్తన.. స్టార్ ఆటగాడికి 37 లక్షలు జరిమానా!
సిద్దిపేట జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కామారెడ్డి, మెదక్ జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సిద్దిపేటలోని శ్రీనగర్ కాలనీ వరద నీటిలో మునిగిపోయింది. రోడ్లపై నుంచి నీరు ఉద్ధృతంగా పారుతుండగా, పలు ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు కాలనీలో నిలిచిపోయిన నీటిని బయటకు తరలించే చర్యలు చేపట్టారు.
ఇక భారీ వరద నీరు చేరడంతో సిద్దిపేటలోని కోమటి చెరువు నిండుకుండలా మారింది. చెరువు మత్తడి పారిపోవడంతో పరిసర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, ఆగస్టు 28 నుంచి మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అనేక జిల్లాలు మళ్లీ వర్ష బీభత్సాన్ని ఎదుర్కొనే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరాలకు సమీపంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ఆవర్తనం రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా బలపడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తూర్పు ఆగ్నేయ దిశ నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు వృత్తాకార పవన ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది.
TCS Bengaluru Lease Deal: అద్దె రూ.2,130 కోట్లు.. టీఎసీఎస్ నయా రికార్డ్..