CM Revanth Reddy: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేడు వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు. గురువారం ఉదయమే వరద ప్రభావిత జిల్లాలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సిద్ధపడ్డారు. ఆఖరి నిమిషంలో సీఎం పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించకపోవటంతో హెలికాప్టర్ ప్రయాణం వీలు కాదని ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదు. ఈరోజు వాతావరణం అనుకూలించకపోవటంతో తాను రాలేకపోయానని, శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వస్తానని గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం ప్రకటించారు.
READ MORE: Wedding-Fraud: పెళ్లి పేరుతో యువకుడిని మోసం చేసి మహిళ.. నిందితుల అరెస్ట్
కాగా.. మొంథా తుఫాన్ వరంగల్ జిల్లాను ముంచేసింది. మొన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్థంభించిపోయింది. లోతట్టు ముంపు ప్రాంతాలు మొత్తం నీటిలో మునిగాయి. శాఖ రాసి కుంట, శివనగర్, బి ఆర్ నగర్, ఎస్సార్ నగర్, ఎన్టీఆర్ నగర్, కిల్లా వరంగల్ ప్రాంతాలలో ఇళ్లల్లోకి వరద నీళ్లు వచ్చాయి. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలు కురిసేసరికి చాలా కాలనీలు చెరువుల్లా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల స్తంభాలు విరిగిపోయాయి. వైర్లు తెగిపోయాయి. చెట్లు నేలకూలాయి. నష్టం భారీగానే జరిగింది. ఎటు చూసినా రోడ్ల మీద వర్షం నీళ్లే కనిపిస్తున్నాయి. నాలాలు ఉప్పొంగుతున్నాయి. ప్రజలంతా వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
READ MORE: Vangalapudi anitha: నేడు అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటన..