CM Revanth Reddy : పద్మవిభూషణ్ అవార్డు గ్రహిత, ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డిని సన్మానించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు జాతి నుంచి ఒక డాక్టర్‌గా అరుదైన గౌరవాన్ని పొందిన వ్యక్తిగా నాగేశ్వర రెడ్డిని అభివర్ణించారు. “నాగేశ్వర రెడ్డి గారు భారతదేశానికి అపార సేవలు అందించారు. ఆయన ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్, మరియు తాజాగా పద్మవిభూషణ్ అవార్డులను గెలుచుకున్నారు. నిజానికి, ఆయన భారత రత్నకు కూడా…