రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్ల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సెక్రటేరియట్‌లో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Telangana : తెలంగాణలో ప్రభుత్వ వైద్య రంగంలో మరోసారి అభివృద్ధి దిశగా ముందడుగు పడింది. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MRB) డాక్టర్లకు శుభవార్తను అందించింది. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు , ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేసింది. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆయుష్ విభాగంలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉండగా, ఎంఎన్‌జేలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ…
Aarogyasri CEO : ఆరోగ్యశ్రీ ఇంచార్జీ సీఈవో గా మరోసారి ఐఏఎస్ అధికారి కర్ణన్ నీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీ విభాగంలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు రావడంతో నిన్నటి వరకు ఉన్న ceo శివ శంకర్ ని జిఏడీ కి అటాచ్ చేసింది తెలంగాణ సర్కార్.. నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కోఆర్డినేటర్లను నియమించారంటూ ఆరోపణలు వచ్చాయి.. జిల్లా కోఆర్డినేటర్ల నియామకానికి లక్షల్లో చేతులు మారినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆరోగ్యశ్రీ సీఈవోగా…
చైనాలో హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (hMPV) వ్యాప్తిపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ DGHS, NCDC డైరెక్టర్, కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటనను విడుదల చేసింది. మెటాన్యూమోవైరస్ (hMPV) అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగానే ఉంటుందని తెలిపింది. ఇది శీతాకాలంలో జలుబు మరియు ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది.. ప్రత్యేకించి యువకులు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది.
Damodara Raja Narasimha : కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల ఉద్యోగాలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ భరోసానిచ్చారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చినప్పటికీ, కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలను ఉద్యోగం నుంచి తీసేయబోమన్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో తనను కలిసిన ఏఎన్‌ఎంలతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. వారి సమస్యలు ఏంటో అడిగి తెలుసుకున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు కోరగా, ఉద్యోగాల రెగ్యులరైజేషన్ అంశం కోర్టు పరిధిలో ఉందని మంత్రి వివరించారు. ఏఎన్‌ఎం రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఈ…
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విడుదల చేసిన డేటా ప్రకారం. జనవరి 1వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు 5372 కేసులు నమోదయ్యాయి. అయితే.. హై రిస్క్ డెంగ్యూ కేసులు హైద్రాబాద్ లో 1,852 నమోదు కాగా.. సూర్యాపేట 471, మేడ్చల్ మల్కాజిగిరి 426, ఖమ్మం 375, నల్గొండ 315, నిజామాబాద్ 286, రంగారెడ్డి 232, జగిత్యాల 185, సంగారెడ్డి 160,…
తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. భానుడి భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తగ్గినట్టే తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి.. దేశవ్యాప్తంగానే కాదు.. తెలంగాణలోనూ కోవిడ్ రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ పైకి కదులుతోంది. అయితే, కేసుల సంఖ్య పెరిగినా ఆందోళన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో రెగ్యులర్ ఫ్లూస్‌తో లక్షణాలతో పాటు జ్వరం, తలనొప్పి, స్మెల్ లేకపోవడం ఉంటే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలని స్పష్టం చేసింది.. దేశంలో కరోనా కేసుల సంఖ్య 66 శాతం…
మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి… రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ మంట పుట్టిస్తున్నాయి… ఓవైపు ఎండల తీవ్రత.. మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. దీంతో ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందని వెల్లడించారు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు. ఆ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్‌లో 40…