Telangana : ఆ డాక్టర్లకు శుభవార్త.. ఈ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
- ఆయుష్ విభాగంలో 156 మెడికల్ ఆఫీసర్ల నియామకం
- ఎంఎన్‌జే హాస్పిటల్‌లో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ
- జిల్లాల్లో క్యాన్సర్ కేర్ సెంటర్ల ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణలో ప్రభుత్వ వైద్య రంగంలో మరోసారి అభివృద్ధి దిశగా ముందడుగు పడింది. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MRB) డాక్టర్లకు శుభవార్తను అందించింది. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు , ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేసింది.
ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆయుష్ విభాగంలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉండగా, ఎంఎన్‌జేలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల ద్వారా ఆయుష్ వైద్య సేవలు మరింత మెరుగవుతాయని, ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుతాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
Also Read
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
Surya Sethupathi: విజయ్ సేతుపతి కొడుకుపై ప్రశంసల వర్షం.. కానీ డిజాస్టర్ కలెక్షన్?
ఆయుష్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. “ఇటీవలే 630 యోగా ఇన్‌స్ట్రక్టర్లను నియమించాం. ప్రస్తుతం మరో 200కి పైగా పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేశాం,” అని తెలిపారు. ఆయుష్ విధానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని క్యాన్సర్ వైద్య సేవలను విస్తరించే ప్రక్రియలో భాగంగా ఎంఎన్‌జే హాస్పిటల్‌లో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అడుగుగా మారనుంది. “కొత్తగా నియమితులైన డాక్టర్లతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. జిల్లాల స్థాయిలోనూ ప్రభుత్వ క్యాన్సర్ సేవలను విస్తరించడంపై దృష్టి సారిస్తున్నాం,” అని మంత్రి చెప్పారు.
కొత్త జిల్లాల్లో డిస్ట్రిక్ట్ క్యాన్సర్ కేర్ (DCC) సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో రీజనల్ క్యాన్సర్ కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. “ఈ సెంటర్లు పూర్తయిన తరువాత, పేషెంట్లు హైదరాబాద్‌కి రావాల్సిన అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే అత్యాధునిక వైద్య సేవలు పొందగలుగుతారు,” అని మంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!