Rajasaab : రాజాసాబ్ సినిమా నిర్మాతలకు నిరాశ.. పాత ధరలకే టికెట్లను అమ్మాలని హైకోర్టు ఆదేశం
- సినిమా టికెట్ల రేట్లు పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
- పదే పదే రేట్లు ఎందుకు పెంచుతున్నారు..?
- ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా..?
- టికెట్ రేట్లు పెంచబోమని మంత్రి కూడా చెప్పారు
- అయినా టికెట్ల రేట్ల పెంపును అనుమతిస్తూ ఎందుకు మెమోలు ఇస్తున్నారు..?
- తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో భారీ చిత్రాల విడుదల సమయంలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ చిత్రానికి సంబంధించి టికెట్ రేట్ల పెంపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టింది. పదే పదే టికెట్ ధరలను ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నిస్తూ, న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది.
Geetha Madhuri: గీతా మాధురి క్యాసినోలో ఎంత పోగొట్టిందంటే..!
Also Read
సినిమా టికెట్ల ధరలను పెంచబోమని స్వయంగా సంబంధిత మంత్రి ప్రకటించినప్పటికీ, మళ్ళీ ధరల పెంపునకు అనుమతిస్తూ మెమోలు ఎలా జారీ చేస్తున్నారని ధర్మాసనం నిలదీసింది. “ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా? తెలివిగా మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారు?” అంటూ ప్రభుత్వ ప్లీడర్‌ను (GP) కోర్టు ప్రశ్నించింది. ప్రజలపై ఆర్థిక భారం పడేలా తీసుకుంటున్న ఈ నిర్ణయాల వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీసింది.
పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. టికెట్ల ధరల పెంపు ప్రక్రియలో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్ట ప్రకారం టికెట్ ధరల పెంపు లేదా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే అధికారం జిల్లా స్థాయిలో కలెక్టర్లకు, హైదరాబాద్‌లో పోలీస్ కమిషనర్‌కు మాత్రమే ఉంటుంది. కానీ హోంశాఖ కార్యదర్శి నేరుగా మెమోలు జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన వాదించారు. మెమో జారీ చేసే అధికారం హోంశాఖ కార్యదర్శికి లేదని స్పష్టం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా మెమో జారీ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు. చట్ట వ్యతిరేకంగా ధరల పెంపును ప్రోత్సహిస్తున్న సదరు అధికారికి 5 లక్షల రూపాయల జరిమానా విధించాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే.. టికెట్ల పెంపుపై ప్రభుత్వ మెమోను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.. పాత ధరలకే టికెట్లను అమ్మాలని ఆదేశించింది హైకోర్టు.
Parasakthi Release: శివకార్తికేయన్ ‘పరాశక్తి’కి లైన్ క్లియర్!
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!