ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డిలు రాజీనామా చేశారు. ఇక, మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి బోడ జనార్ధన్ సైతం గుడ్ బై చెప్పారు. పార్టీలు మారి వచ్చిన వారి కి టికెట్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసిన నేతలు అంటున్నారు.
Read Also: Lavanya Tripathi: రిస్పెషన్ లో హైలైట్ గా లావణ్య చీర.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ కు రాజీనామా చేసిన డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక, పార్టీ కోసంముందు నుంచి మా కుటుంబం పని చేసిందని సాజిద్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీని వీడాలంటే భాద గా ఉందన్నారు. ఇక, రేవంత్ రెడ్డి తన టీడీపీ నుంచి వచ్చిన వారితో పాటు ఆర్ఎస్ఎస్ నాయకులకు టికెట్లు ఇచ్చారు అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వారందరితో వేరే పార్టీ పెట్టుకుంటాడు.. పైసలకే టికెట్ ఇస్తా అంటే బాగుండు కదా.. కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేఖం కాదు అని ఆయన తెలిపారు. టికెట్ రాకున్నా ఇండిపెండెంట్ గా బరిలో ఉండి గెలిచాక మళ్ళీ కాంగ్రెస్ లో చేరుతామని సాజిద్ ఖాన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేఖంగా అసమ్మతి నేతలను నుంచి సంజీవ రెడ్డిని నిలపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
Read Also: Nama Nageswara Rao: కష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ ఎన్నో రకాలుగా ఆదుకున్నారు..
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మరో నేత పీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేస్తే తడి బట్టలతో గొంతు కోశారు అని ఆమె మండిపడింది. రాజకీయలు అంటే డబ్బేనా అని ప్రశ్నించారు. ఏ సేవ చేశాడు అని పార్టీ టికెట్ కంది శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చింది.. 5 ఏళ్లు మాతో పని చేయించుకోని టికెట్ ఆయనకు ఇవ్వడం ఏంటి.. వెట్టి చాకిరి మాకు.. భోజనం అయనకా.. మా ముగ్గురి పక్షాన ఇండిపెండెంట్ గా సంజీవ రెడ్డి పోటీ చేస్తారు అని పీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత తెలిపారు.
Read Also: Tejaswi Yadav: సుప్రీంకోర్టులో తేజస్వి యాదవ్‌కు రిలీఫ్.. పరువు నష్టం కేసులో స్టే
ఇక, చెన్నూర్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి బోడ జనార్ధన్ మాట్లాడుతూ.. అప్లికేషన్ పెట్టుకున్న వారికే టికెట్ ఇస్తామని చెప్పి.. కాంగ్రెస్ పార్టీ డబ్బున్న వివేక్ కు టికెట్ కేటాయించిందన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసిన.. నాకంటే గొప్పవాడా వివేక్.. డబ్బు మూటలు పట్టుకొచ్చి.. ప్రజలను కొందామని చూస్తున్నారు.. వివేక్ పార్లమెంట్ లో అభివృద్ది చేసింది ఏముందో చూపించండి అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దళితులంటే కేవలం వివేక్ కుటుంబమేనా.. మేము దళితులం కాదా.. నాన్న పేరును అడ్డం పెట్టుకొని.. రాజకీయాలు చేసి బీ-ఫామ్ తెచ్చుకున్నాడు.. వివేక్ ను ఓడించడం కోసం బీఎర్ఎస్ పార్టీలో చేరుతున్నాను అని మాజీ మంత్రి బోడ జనార్థన్ తెలిపారు.