సీపీఐ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదిరింది. కొత్తగూడెం సీటు, ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. మునుగోడులో స్నేహపూర్వక పోటీ కూడా ఉండొద్దని తేల్చి చెప్పింది. ఇక, సీపీఐ కార్యాలయంలో రేవంత్ రెడ్డి, దీపా దాస్ మూన్షిలు సీపీఐ నేతలు నారాయణ, కునమనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డిలో సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం సీపీఐ-కాంగ్రెస్ నేతలు ఉమ్మడిగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో బాంబు పేలుడు.. కానిస్టేబుల్, ఇద్దరు పోలింగ్ టీమ్ సభ్యులకు గాయాలు
ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య ఒక ఒప్పందానికి వచ్చామని ఆయన తెలిపారు. మోడీ, కేసీఆర్ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అని ఆయన పేర్కొన్నారు. ఇండియా కూటమిని గెలిపించాలని పొత్తులు పెట్టుకున్నాము.. ఇక, సీపీఎంతో కూడా చర్చలు జరుగుతున్నాయి.. ఆ చర్చలు కూడా ఫలిస్తాయి అనుకుంటున్నాను అని టీపీసీసీ చీఫ్ చెప్పారు. నాకు ఆ ఆశ ఉంది.. తప్పని పరిస్థితులు వాళ్లకు చెప్పినం.. సహకరించండి అని ఆడిగాము.. పెద్ద మనసుతో అంగీకారం వ్యక్తం చేశారు.. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక, తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం పార్టీతో పాటు సీపీఐతో కలిసి పని చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సహకరించినదుకు ధన్యవాదాలు.. సమన్వయం కోసం కమిటీ.. చట్టసభల్లో సీపీఐ ఉండాలి.. సెక్యులర్ శక్తులకు మంచి ఇండీకేషన్ ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
Read Also: CM KCR: కాంగ్రెస్ పార్టీనే పాలమూరు జిల్లాను పట్టించుకోలేదు..
అలాగే, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఓ ప్రతిపాదన తో వచ్చారు అని ఆయన తెలిపారు. స్వతహాగా రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు అని ఆయన చెప్పారు. రాజకీయ అనివార్యత దృష్టితో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. సీపీఐ గొంతు అసెంబ్లీలో వినిపించాలి అనేది మా ఉద్దేశం.. కాంగ్రెస్ కి సానుకూల వాతావరణ ము ఉంది.. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి అని ఆయన అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మిత్రులుగా మారారు.. తెలంగాణలో ప్రజల ఫిర్యాదులు వినే పరిస్థితి లేదు.. ఆర్టీసీలో సంగం లేకుండా కేసీఆర్ చేశారు.. మోడీకి తక్కువేం కాదు కేసీఆర్.. నిర్బంధ ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు.. సీపీఎంతో కూడా మైత్రి ఉండాలి అని చర్చ చేస్తున్నామని కూనంనేని సాంబశివరావు చెప్పుకొచ్చారు.
Read Also: KH234: కమల్ యాటిట్యూడ్ కు తగ్గ పేరు ‘తగ్ లైఫ్’.. మణిరత్నం నుంచి ఇలాంటిది ఊహించలేదే
ఇక, సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. నెల రోజుల క్రితం నిచ్చితార్థం జరిగింది.. ఇవాళ పెళ్లి జరిగింది అంటూ వ్యాఖ్యనించారు. కేసీఆర్ నుండి విముక్తి పొందాలి తెలంగాణ సమాజం.. సీట్లు ఎన్ని ఇచ్చారు అనేది కాదు.. మోడీ నుండి దేశం కాపాడాలి అని ఆయన కోరారు. అలాగే, చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్..మద్దతు ఇచ్చింది సీపీఐ.. మిత్రుత్వం కొనసాగుతుంది అని ఆయన పేర్కొన్నారు.