దేవరకద్రలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, తుంగభద్ర నదులు పారే ఈ జిల్లాను సర్వనాశం కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. పాలమూరు జిల్లా ఒకప్పుడు పాలుగారిన జిల్లా.. అద్భుతమైన జిల్లాను సమైక్య రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితి ఉండేది.. గత సీఎంలు కూడా జిల్లాను దత్తత తీసుకున్నామని చెప్పి పునాది రాళ్లు వేశారు తప్ప.. పిడికెడు నీళ్లు తెచ్చవ్వలేదు అని ఆయన మండిపడ్డారు. పంటలు ఎండిపోయి వలవల్ల ఏడ్చి.. చాలా మంది వలసలు పోయారు అని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.
Read Also: Meruga Nagarjuna: రాష్ట్రంలో సామాజిక విప్లవానికి సీఎం జగన్ తెర తీశారు..
అలాంటి ఈ జిల్లాను ఏ పార్టీ పట్టించుకుంది..? మన గోస ఎవడైనా చూసిండా..? అన్నది ఆలోచించాలని గులాబీ బాస్ కేసీఆర్ సూచించారు. కృష్ణా, తుంగభద్ర నదులు పారే జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టించే గతి పట్టించింది ఏ పార్టీనో ఆలోచించాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు 50 ఏళ్ల పాటు కరువు అనుభవించారని ఆయన పేర్కొన్నారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ.. ఉన్న తెలంగాణను ఆంధ్రవలో కలిపి మన ప్రాజెక్టులను సమైఖ్య పాలకులు రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు. గత పాలకులు ఒక్క ప్రాజెక్టు కూడా అడగలేదు అని కేసీఆర్ చెప్పారు.
Read Also: CM Kejriwal: ఈడీ సమన్లపై గందరగోళం.. ఎమ్మెల్యేలతో సీఎం కేజ్రీవాల్ సమావేశం
నేను రాజకీయల కోసం చెప్పడం లేదు.. ఈ ప్రాంతం ఏపీలో కలవకపోతే చాలా బాగుపడుతుంటే.. నష్టపోయింది.. చారెడ్ నీళ్లు కావాలని అడిగేతోడు లేడు అని ఆయన వ్యాఖ్యనించారు. మన తెలంగాణ బిడ్డ అంజయ్య సీఎం అయ్యాకు శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టు ముందకు నడిచింది. అయినా నీళ్లు రాలే..కర్ణాటకకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా దుర్మార్గం చేసింది. 2001లో గులాబీ జెండా ఎగిరేదాకా కర్ణాటకు నష్టపరిహారం ఇవ్వలేదు.. ఇక్కడ రైతాంగానికి నీళ్లు ఇవ్వలేదు.. ఇది చరిత్ర నేను చెప్పేది సత్యం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.