తెలంగాణ కోసం 12వందల మంది ప్రాణాలు కోల్పోయారు అని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ పాండురంగ సావంత్ అన్నారు. 12వందల బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ.. దీనికి సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. రక్తం చిందకుండా బీజేపీ ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది.. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హామీలను విస్మరించింది.. కాంగ్రెస్ అవినీతి, కమిషన్ల పార్టీ.. ఒక్క పరీక్ష కూడా నిర్వంచలేని అసమర్థ ప్రభుత్వం.. బీఆర్ఎస్ సర్కారు అవినీతిమయమైంది అని గోవా సీఎం ప్రమోద్ పాండురంగ సావంత్ పేర్కొన్నారు.
Read Also: Harish Rao: తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది..
కాంగ్రెస్- బీఆర్ఎస్ రెండు ఒక్కటే.. నాణానికి బొమ్మ, బొరుసు లాంటివి అని ప్రమోద్ పాండురంగ సావంత్ అన్నారు. కాంగ్రెస్- బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి.. కలిసి పని చేశాయన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సి ఉంది.. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల నార్త్ స్టేట్స్ అభివృద్ధి చెందాయి.. డబుల్ ఇంజన్ సర్కారు వస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పసుపు బోర్డు, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చింది.. జాతీయ రహదారులను అభివృద్ధి చేసింది.. ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద 2.3 లక్షల ఇళ్లు నిర్మించింది.. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ ను బీజేపీ అధికారంలోకి వస్తే నేరవేరుస్తుంది.. నవ భారత నిర్మాణం కోసం తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలి అని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ పాండురంగ సావంత్ కొరారు.