కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి పేరు కాస్త రేటెంత రెడ్డి అని పిలిచే కాడికి వచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ పై అహంకారంతో, బలుపెక్కి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అంతేకాకుండా.. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.
Election Commission: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.
ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ.. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. అంబర్ పేటలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు నీరాజనం పడుతున్నారు.
తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారో లెక్క తేలింది. మూడు పార్టీలు కూడా బడుగుల ప్రతినిధి తామేనని చెప్పుకునే ప్రయత్నం చేశాయి. ఇంతకీ ఏ పార్టీ ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లిందో తెలుసా?. ఎన్నికల్లో గెలవాలంటే ఏ ఒక్క వర్గమో ఓటేస్తే సరిపోదు. అందరి మద్దతు కావాల్సిందే. అందుకే అన్ని పార్టీలు కులాలను, వర్గాలను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
వేములవాడ రాజకీయాలు వేడెక్కాయి. వేములవాడలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తులా ఉమకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకపోవడంతో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. వేములవాడ బరి నుంచి వికాస్ రావు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో తుల ఉమ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
మాదిగలను పశువుల కన్నా హీనంగా చూసింది ఈ సమాజమంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వాపోయారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మాదిగ విశ్వరూప మహాసభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మాటలు చెపుతున్నాయని.. మోడీ మాత్రమే సామాజిక న్యాయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మాదిగల విశ్వరూప మహా సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందన్నారు. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అంబేడ్కర్ స్వప్నాన్ని తాము నెరవేరుస్తామన్నారు.
ఎన్డీయే ప్రభుత్వ తొలి లక్ష్యమే పేదరిక నిర్మూలన అని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. గుర్రం జాషువా తన కష్టాల్ని కాశీ విశ్వేశరుడికి విన్నవించుకున్నారని ఆయన చెప్పారు. బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కాశీ విశ్వనాథుడి దీవెనలతోనే నేను ప్రధానిగా మీ ముందు ఉన్నానన్న ప్రధాని మోడీ.. పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య ఉంటే.. ఆనందం రెట్టింపు అవుతుందన్నారు.
సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో మాదిగల విశ్వరూప మహాసభ జరుగుతోంది. విశ్వరూప మహాసభకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ప్రధాని రాక నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ శ్రేణుల నినాదాలు మారుమ్రోగాయి. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చేరుకున్న ప్రధాని మోడీకి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.