Election Commission: ఆ.. ప్రకటనలు ప్రసారం చేయవద్దు.. టీవీఛానెళ్లకు ఎన్నికల సంఘం లెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి…ప్రకటనలే ముఖ్యం. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధాన వార్తాపత్రికలు, టీవీ ఛానెల్‌ల ద్వారా ఎన్నికల ప్రచార ప్రకటనలు ఇస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నవారే ప్రభుత్వ వైఫల్యాలను వీడియోలు తీసి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు తమ సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రచారం నిర్వహించడం ద్వారా తమ భావాలను ప్రజలకు సులభంగా చేరవేయవచ్చని పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఈ ప్రచార ప్రకటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల రాజకీయ ప్రకటనలపై నిషేధం విధిస్తూ సీఎం ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఛానళ్లు, సోషల్ మీడియా ఛానళ్లకు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి లేఖ రాశారు.
అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల కోసం రాష్ట్ర స్థాయి ధ్రువీకరణ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని సీఈవో వెల్లడించారు. ప్రచారంలో భాగంగా, రాజకీయ పార్టీలు వార్తాపత్రికలు, టీవీ ఛానెల్‌లలో ప్రకటనలను ముద్రించి ప్రసారం చేస్తాయి, వీటిని మొదట పరిశీలన కోసం రాష్ట్ర స్థాయి ధృవీకరణ కమిటీకి పంపుతారు. పరిశీలన తర్వాతే ప్రకటనలకు ఆమోదం లభిస్తుందని, అయితే మార్పులు చేర్పులు చేసి ఆమోదం పొందిన తర్వాతే ప్రసారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీఈవో కార్యాలయం స్పష్టం చేసింది. ఇష్టానుసారంగా టెలికాస్ట్‌లో మార్పులు చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందున ప్రకటనలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. కాగా..వాటి అనుమతుల్ని రద్దు చేసి ప్రసారం కాకుండా నిషేధం విధించడంతో అవి ఇకపై టీవీ ఛానెళ్ళలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలలో డిస్‌ప్లే అయ్యే అవకాశంలేదు. ఈమేరకు మీడియా సంస్థలకు సీఈవో లేఖ రాశారు. ఆ ప్రకటనల ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఛానళ్లకు సూచించారు.
Minister KTR: అవసరం అయితే కాళ్ళు పట్టుకుని ఓట్లు అడగాలి..!
Also Read
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!