భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. స్వాత్రంత్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది.. ప్రజాస్వామ్యంలో మెచ్యూరిటీ మన దేశంలో ఇంకా రాలేదు అని ఆయన వ్యాఖ్యనించారు.
సీఎం కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారం రేపటి నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ కేసీఅర్ ఎన్నికల ప్రచారం స్టార్ట్ కానుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై.. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నవంబర్ 9న నామినేషన్లు వేసి కామారెడ్డిలో సభతో ఆ విడత షెడ్యూల్ పూర్తి చేశారు. తాజాగా మళ్లీ రేపటి నుంచి ప్రచారానికి రెడీ కానున్నారు.
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడితే సరిపోతుందని తెలిపారు. మాదిగలకు మోసం చేసే ప్రయత్నం మోడీ చేశారని అన్నారు. డిసెంబర్ 4 నుండి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టండి.. మద్దతు ఇస్తామని రేవంత్ పేర్కొన్నారు. కండిషన్ లేకుండా రాహుల్ గాంధీ మద్దతు ఇస్తారని తెలిపారు.
తాను గజ్వేల్ వస్తున్నా అని తెలవగానే కేసీఆర్ కామారెడ్డి పోయారని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక (మం) దుద్దెడలో ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తన భార్య అన్నీ అమ్ముకుందాం, అవసరం అయితే మళ్ళీ కొంగు నడుంకి కట్టి పనిచేస్తా.. నువ్వు మాత్రం కేసీఆర్ మీద కొట్లాట ఆపవద్దు అని చెప్పిందని ఈటల తెలిపారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించడం రేవంత్ రెడ్డి అజ్ఞానానికే తార్కాణమని మంత్రి కొప్పుల అన్నారు. 2018 ఎన్నికపై ఈవీఎంల ట్యాంపరింగ్ చేసాను అన్న రేవంత్ రెడ్డి మాటలు.. ఎన్నికల కమిషన్ కించపరచడమే అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. ఇకనైనా బుడ్డర్ కాన్ వేషాలు మానుకోవాలని రేవంత్…
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఓదెల జడ్పీటీసీ రాములు యాదవ్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి హరీశ్ బీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడారు. ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు.
అంబర్పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్.. బాగ్ అంబర్పేట డివిజన్లోని తురాభ్ నగర్, ఎరుకల బస్తీలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా.. డివిజన్ ప్రెసిడెంట్ చంద్రమోహన్, మహిళా నాయకులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. ఈ ప్రచారంలో బస్తీ వాసులు కాలేరు వెంకటేష్ కు గులాబీ పూలతో పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.