Asaduddin Owaisi: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పెళ్లి అంటూ బీజేపీ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంట్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని పెళ్లి పెద్దగా, ఖాజీగా అభివర్ణించింది. ఈ పోస్టర్‌పై అసదుద్దీన్ స్పందించారు. బీజేపీపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను అందరికి పెళ్లి కొడుకునా.. లేక సోదరుడినా..? ’’ అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో దీపావళి పండగ వాతావరణం కంటే ఎన్నికల వాతావరణం వేడి వేడిగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో భారీగా నామినేషన్లు నమోదయ్యాయి.
చేవెళ్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సున్నపు వసంతంకు పీసీసీ నుంచి పిలుపు వచ్చింది. టికెట్ రాకపోవడంతో చేవెళ్ల రెబల్ అభ్యర్థిగా సున్నపు వసంతం నామినేషన్ వేసిన సంగతి విదితమే.
తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. యాక్టివ్‌గా ఉన్న ప్రజాశాంతి పార్టీని యాక్టివ్‌గా లేదని అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. పలు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రాష్ట్రంలో పింక్ వేవ్ తప్ప మరో వేవ్ లేనే లేదని ఆమె వ్యాఖ్యానించారు.
Tula Uma: తెలంగాణలో సీట్ల పంపకాలపై బీజేపీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. చివరి క్షణంలో బీఫారం రాకపోవడంతో వేములవాడకు చెందిన తుల ఉమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బీజేపీని వీడాలని యోచనలో వున్నారు.
Telangana: తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 119 నియోజకవర్గాలకు 1100 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
PM Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ కూడా తమ అగ్రనేతలను ఆహ్వానిస్తూ ప్రచార హోరును పెంచింది. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు మరోసారి రాష్ట్రానికి రానున్నారు.
కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన తుది జాబితాలో సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థిగా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిని ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డితో అధిష్టానం మాట్లాడుతుందని ఆయన తెలిపారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ అభివృద్ధి కోసం రమేష్ రెడ్డి కష్టపడి పనిచేశారన్నారు. రమేష్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం సముచిత స్థానం ఇవ్వాలని కోరానని తెలిపారు. రమేష్ రెడ్డితో వివాదం లేకుండా ఇద్దరం కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.