తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ, వైఎస్సార్‌టీపీ తప్పుకున్నాయి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో పోటీ వద్దని చెప్పడంతో కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర అసంతృప్తికి లోనై ఆ తర్వాత బీఆర్ఎస్‌లోకి అనుచరులతో చేరిన విషయం తెలిసిందే.
జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. దోనుర్, సింగందొడ్డి, లాఖ్య తండా, మంగళిగడ్డ తండా, మోత్కూలకుంటా తండా మీదుగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారం కొనసాగుతుంది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు చోట్ల నామినేషన్ వేశారు.. కొడంగల్ లో అతను నామినేషన్ వేసిన సెట్ లో ఏడు కాలాలు ఉన్నాయన్నారు. మీరు చెప్పేనట్టుగా చెయ్యాలి అంటే ముందుగా రేవంత్ రెడ్డి నామినేషన్ రద్దు చెయ్యాల్సి ఉంటుంది అని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
సామాజిక పోరాటంలో ఒక ప్రధాని మోడీ పాల్గొనడం చరిత్రలో స్థిర స్థాయిలో నిలిచి పోతుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మోడీ మాదిగల సమస్యను అర్థం చేసుకుని కమిట్ మెంట్ తో మాట్లాడారు.. వాళ్ళ పోరాటం ఎవరికో వ్యతిరేకం కాదు.
Top Headlines, Top News, Telangana, Andhrapradesh, Telugu News, Telangana Elections 2023, Telangana Assembly Elections, National News, International News
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే దౌల్తాబాద్ లో అభివృద్ధి, సంక్షేమం జరిగింది అని ఆయన పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాలు, కాలేజీలు తెస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పిండ్రు.. పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చని నేతలు మళ్ళీ గెలిపించాలని మిమ్మల్ని అడుగుతున్నారు.
తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ను బీఆర్ఎస్ లీగల్ టీమ్ కలిసింది. రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీని కించపరిచే విధంగా కాంగ్రెస్ యాడ్స్ ను ఆపాలని సీఈవోకు కంప్లైంట్ చేశారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడిని ఖండించారు.
మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య సంగీత నాయక్ పై బీఆర్ఎస్ సర్పంచ్ అతని కుటుంబ సభ్యులు దాడి చేశారు. నరసింహుల పేట మండలం గోపాతండా వద్ద ఘటన చోటు చేసుకుంది.
మహేశ్వరం నియోజకవర్గంలో ఏనుగు పార్టీ దూసుకుపోతుంది. నియోజకవర్గంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డికి స్థానిక ప్రజలు కేఎంఆర్ ట్రస్ట్ లబ్ధిదారులు, మహిళలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు.