కొత్త ప్రభాకర్ రెడ్డిపై దారుణంగా దాడి చేశారని మంత్రి హరీశ్ మండిపడ్డారు. తర్వాత కోడికత్తి, కత్తిపోటు అంటూ హేళన చేశారని మంత్రి ఆవేదన వ్యకం చేశారు. గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు.. గువ్వలపై కాంగ్రెస్ నేత వంశీకృష్ణ స్వయంగా రాళ్లు విసిరారని మంత్రి హరీశ్ వెల్లడించారు.
నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం కుమ్మరోనీ పల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి జరిగింది. అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు ఎన్నికల ప్రచారంలో ఉండగా మతిస్థిమితంలేని వ్యక్తి మట్టిపెళ్లతో దాడి చేశాడు.
కాళేశ్వరం మీదు ఏ మాత్రం అవగాహన లేకుండా కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్, హరీశ్ రావు మీద బురద చల్లడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. కోదాడతో పాటు పలు నియోజకవర్గాలకు సాగునీరు వచ్చింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. వచ్చిన మంచి పేరును చెడగొట్టాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్‌పై నమ్మకం, మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తాయని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి పేర్కొన్నారు. నాకు నేను ట్రబుల్ షూటర్ అని ఎప్పుడూ చెప్పుకోలేదని.. హరీశ్ రావు ఏనాడు కేసీఆర్ మాట జవ దాటలేదన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని మంత్రి స్పష్టం చేశారు.
కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి గంగులను టార్గెట్ గా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూకబ్జాలు, అవినీతితో గంగుల కోట్లు సంపాదించుకున్నారు. యువతను గంజాయి మత్తులో ముంచుతున్నారు.. ఓట్ల కోసం ఓటుకు రూ.10 వేలతో పాటు యువతకు 5 వేల సెల్ ఫోన్లు పంచేందుకు సిద్ధమైండు అని ఆయన ఆరోపించారు.
55 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెసోళ్ళు గుడ్డీ గుర్రాల పండ్లు తోమారు అంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 55 ఏళ్ళ పాలనలో జరగనిది ఈ కాంగ్రెసు వాళ్ళు ఎలా చేస్తారు.
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు రెండు సార్లు అత్యధిక మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించారు.. మీరు పెంచిన మొక్క వృక్షమై పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండే స్థాయికి చేరింది అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో రెడ్డి, రావు ఎవరైనా సరే మా దగ్గర వంగాలి అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు భారత దేశంలో ప్రతి హిందూ- ముస్లింల గొడవలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అంటూ ఆయన వ్యాఖ్యనించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70కి పైగా స్థానాలను గెలుస్తుంది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరో వైపు జగిత్యాల జిల్లాలో యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ అధికారులకు అనుమతులు మంజూరు చేస్తుండడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.