బీజేపీ అంటే సబ్ కా వికాస్.. బీఆర్ఎస్ అంటే కెసిఆర్ ఫ్యామిలీ వికాస్.. కాంగ్రెస్ అంటే రాహుల్ ఫ్యామిలీ వికాస్ అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఆ రెండు పార్టీలలో పని చేస్తున్న వారు ఆ కుటుంబాలకు బానిసలుగా వ్వవహరిస్తున్నారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటిస్తు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మూడు గంటల కరెంటు కావాలా.. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే 24 గంటల కరెంటు కావాలా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తునే.. తాము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని.. అస్తులు అమ్ముకుని ప్రజలకు సేవ చేశామని మాజీ కాంగ్రెస్ నేత సుజాత తెలిపారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి పక్ష పార్టీలకు 11 సార్లు అవకాశం ఇస్తే ఏం పీకారు? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వీళ్లకు?.. బోర్ కొట్టిందనీ కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటారా?.. అభివృద్ది చేసే వాడు ఇంకొన్నేళ్లు ఉంటే తప్పేంటి?.. కర్ణాటకలో బిల్డర్స్ నుంచి కమిషన్ 40 నుంచి 400 కు పెరిగింది అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
గజ్వేల్ లో దాఖలైన నామినేషన్లపై బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు 127 మంది వేసిన నామినేషన్లలో 13 నామినేషన్లను ఆర్వో అధికారులు తిరస్కరించారు. ఇక, గజ్వేల్ నుంచి ఎన్నికల బరిలో 114 మంది అభ్యర్థులు ఉండనున్నారు.
నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 9:30 నుండి రాచాలుర్ గ్రామంలో ప్రచారం ప్రారంభించి భేగంపేట్, గూడూరు, మాల గూడూరు, బేగరి కంచే, మీర్ఖన్ పేట్ ఆకుల మైలారం, పలు గ్రామాల్లో కొత్త మనోహర్ రెడ్డి ర్యాలీగా పర్యటించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో కలిపి 4,798 మంది, 5,716 నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న నామినేషన్ల పరిశీలనలో 6 వందలకు పైగా నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ సందర్భంగా ఇవాళ స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట, కామారెడ్డి నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.