ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఖమ్మంలో పాత రుగ్మతలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి.. తుమ్మలకు అధర్మం పోరాటం అలవాటు అంటూ ఆయన విమర్శలు చేశారు. నా నామినేషన్ ను తిరస్కరించాలని తుమ్మల ఫిర్యాదు చేశారు.. తుమ్మల ఫిర్యాదుకు ఎన్నికల అధికారులు సమాధానం ఇచ్చారు.. ఆయన చెప్పగానే రిటర్నింగ్ ఆఫీసర్ రద్దు చేస్తారా అని పువ్వాడ ప్రశ్రించారు. ఆయన చెప్పినట్టు చేస్తే మంచోళ్ళు, చెయ్యకపోతే చెడ్డోళ్ళు.. తప్పులు ఉంటే నోటీస్ ఇస్తారు.. నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు అని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
Read Also: BY Vijayendra: ఈనెల 15న కర్ణాటక బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్న బీవై విజయేంద్ర
డిపెండెన్స్ లేనప్పుడు ఎందుకు పెట్టాలి.. గతంలో నా కుమారుడుకి పెళ్లి జరుగలేదు, ఇప్పుడు పెళ్లి అయింది అని పువ్వాడ అజయ్ అన్నారు. అఫిడవిట్ అనేది ఆస్తులు, లావాదేవీలు ఉంటే చూపించాలి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు చోట్ల నామినేషన్ వేశారు.. కొడంగల్ లో అతను నామినేషన్ వేసిన సెట్ లో ఏడు కాలాలు ఉన్నాయన్నారు. మీరు చెప్పేనట్టుగా చెయ్యాలి అంటే ముందుగా రేవంత్ రెడ్డి నామినేషన్ రద్దు చెయ్యాల్సి ఉంటుంది అని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
Read Also: Breath Trailer: నందమూరి వారసుడు.. అదరగొట్టాడు
రిటర్నింగ్ ఆఫీస్ తప్పు చేస్తే కోర్టుకు వెళ్లొచ్చు కానీ బెదిరించడం ఏంటి అని మంత్రి పువ్వాడ అజయ్ ప్రశ్నించారు. మీకు సలహా ఇచ్చింది ఎవరో కానీ, మీ సమయం, నా సమయం వృధా చేశారు.. అధర్మ పోరాటం కాదు ధర్మం పోరాటం చెయ్యాలి.. అబ్బద్దపు ప్రచారం చెయ్యకండి.. గత నలభై ఏళ్ల పాటు మీరు చేసింది ఇదే.. మీ ఓటమిని తట్టుకోలేక ఇలా చేస్తున్నావ్.. ఎన్నికల్లో ధైర్యంగా పోరాటం చెయ్యాలి.. పిరికోడు మాత్రమే వెన్నుపోటు పొడుస్తారు అంటూ పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.