తెలంగాణలో ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లీడ్ లో ఉండగా.. అధికారం దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో.. కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ ఎన్నికల్లో మొదటి సారి గెలిచారు. గతంలో పోటీ చేసి ఓడిపోయినవాళ్లు, ఈసారి మాత్రం పోటీచేసిన వాళ్లలో కొందరిని ప్రజలు ఆశీర్వదించారు. ఈసారి వీరు అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనే అవకాశం దక్కింది. అయితే వారిలో అతి చిన్న వయస్సు ఉన్న వాళ్లు కూడా ఉన్నారు.
Revanth Reddy Tweet on Kodangal Peoples: కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తనూ కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. 32,532 మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డికి 107429 ఓట్లు రాగా.. బీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి 84897 ఓట్లు…
KTR Tweet Goes Viral: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే 42 స్థానాలు గెలిచిన కాంగ్రెస్.. మరో 22 చోట్ల ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 60కి కాంగ్రెస్ దగ్గరలో ఉండగా.. అధికార బీఆర్‌ఎస్ కేవలం 13 స్థానాల్లో మాత్రమే గెలిచి ఓటమి దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ తమ ఓటమిని ఒప్పుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్…
Malreddy Ranga Reddy Won From Ibrahimpatnam: తన విజయాన్ని ఇబ్రహీంపట్నం ప్రజలకు అంకితం చేస్తున్నా అని కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఆరు పథకాలు ప్రతి నిరుపేద కుటుంబానికి అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై మల్‌రెడ్డి రంగారెడ్డి గెలిచారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో ఆయనను ఇబ్రహీంపట్నం అభ్యర్థిగా ప్రకటించింది. విజయం అనంతరం ఎన్టీవీతో మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో ఫలితం వచ్చింది. ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియపై గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దాదాపు 18వేలకు పైగా ఓట్లతో ఓటమి పాలయ్యారు.
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో దూసుకుపోతుంది. ఈ క్రమంలో.. ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి ఆరుగురు బీఆర్ఎస్ మంత్రులకు ఎదురుదెబ్బ తగిలింది. అందులో ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి మంత్రులు వెనుకంజలో కొనసాగుతున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఈ క్రమంలో మాజీ టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తమ్ కుమార్ హుజూర్ నగర్ లో, పద్మావతి కోదాడలో ముందంజలో ఉన్నారు.
Congress Leading in Telangana Elections Counting: తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా సాగుతోంది ఈ ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించారు తర్వాత ఎనిమిదిన్నర గంటల నుంచి మొదటి రౌండ్ లెక్కింపు మొదలుపెట్టారు అధికారులు అయితే ఈ లెక్కింపులో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ముందంజలో ఉందని సమాచారం అందుతుంది దాదాపుగా అన్ని జిల్లాలలోనూ కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది…
Pocharam Srinivas Reddy: ఎగ్జిట్ పోల్స్ వేరు.. ఎక్జాట్ పోల్స్ వేరు.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మాట్లాడుతూ..
Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.